పుట:Kavijeevithamulu.pdf/590

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

584

కవి జీవితములు.

ర్వగ్రంథ మెద్దియో ఆపత్త్రికలో వ్రాయుటకు నుపన్యాసకునివలనఁ గోరఁబడినట్లు పైయుపన్యాసాంతమువలనఁ గాన్పించునుగదా. పిమ్మట నముద్రిత గ్రంథచింతామణి పత్త్రికాధిపతి పైయుపన్యాసమునకంతకు నతిచమత్కారముగఁ దనయభిప్రాయమిచ్చె. అదియెట్లన్నను :-

తేది 1 జనవరి ఆ 1887 సం. అముద్రితగ్రంథచింతామణిలో

"పైనుదాహరించిన మూర్తి రామరాజభూషణుల భేదమును గుఱించి శబ్దరత్నాకరమును జూచుచో, గతమాసమున బోడపాటి, రామలింగేశ్వరప్పగారు, విష్ణుచిత్తీయమునుగూర్చి వ్రాసిన యంశమునకును బరస్పరము విరుద్ధముగా నున్నది. గావునఁ జదువరులకు నీభేదముఁ దెలుపుటకుగా నీక్రిందివిషయమును బ్రకటించితిమి. 'పత్త్రికాధిపతి' అనియీక్రిందియంశము శబ్దరత్నాకరములోనిది యెత్తివ్రాసెను. ఎట్లన్నను :-

"అల్లసానిపెద్దన. ఈయన కృష్ణదేవరాయలకాలమందలి పండితులలో ముఖ్యుఁడుగా నుండెను. ఇతఁడు స్వారోచిషమనుసంభవ మనునొకకావ్యమును వ్రాసెను. దానిని మనుచరిత్ర మని చెప్పుదురు. అది మృదుశైలియు "అల్లసానివానియల్లికబిగియును" అన్నట్లు కవిత్వ గాంభీర్యము గలిగి శృంగారరసప్రధాన మై యున్నది. అందు నాలవ యాశ్వాసము కేవలాంధ్రపదభూయిష్ట మై యుండును. పూర్వకవితా ధోరణి ననుసరించి యుండుటంజేసి కొన్ని యెడల నైషధమార్కండేయపురాణములయందలివాక్యములకును, నిందలి వాక్యములకు నిసుమంతయేనియు భేద మగపడకయుండును. ఇతఁడే విష్ణుచిత్తీయ మని ప్రసిద్ధిఁ బొందినయాముక్తమాల్యద యనుకావ్యమును వ్రాసినవాఁ డని చెప్పుదురు. శైలి భేదిల్లి వ్యాకరణదోషయుక్త మై యుండుటం జేసి అందుఁ జెప్పబడినయ ట్లది కృష్ణదేవరాయనిచేతనో మఱియొకకవిచేతనో వ్రాయఁబడినది గాని పెద్దనచే వ్రాయంబడినది గా దని తోఁచుచున్నది. స్వారోచిషమను సంభవములోని కొన్ని పద్యము లం దుండుట