పుట:Kavijeevithamulu.pdf/543

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ్రీ కృష్ణదేవరాయలు.

537

బోధముం జెవిఁ బెట్టనందులకు విచారింప నారంభించెను. పిమ్మట రాయలు తనమంత్రికి వర్తమానంబు పంపి పిలిపించి తా నావఱలోఁ బడినది తప్పుమార్గ మని యొప్పుకొని కార్యసాధక మగుకర్తవ్య మాలోచింపుఁ డని ప్రార్థించెను. అందుపైని అప్పాజీ అపుడు శత్రువుల జయించుట సులభము కా దని విన్నవించెను. అయినను అపుడు కర్తవ్య మా గజపతిసేనలకు భేదము కల్పింపవలె నని చెప్పెను.

పిమ్మట తిమ్మరుసు రాయనికడఁ గొంతధనముం గైకొని గజపతిరాజు సేనానులుగా నుండినపదియాఱు (16) గురు సామంతప్రభువుల పేరిటను భ్రామకము లగువార్తలు గలజాబులు వ్రాసి, సిద్ధపఱిచి వానిలో విలువ గలసొమ్ములు, ధనము, చీచి చీనాంబరములును ఉంచి ఆపెట్టెలును జాబులును తనమనుజుల పరముగా నిచ్చి, వారి నేకాంగులుగాఁ బోయి పెట్టెల నిచ్చినట్లు మరల జాబులు పట్టుకొనిరం డని పంపెను. అట్లుగా నాజ్ఞాపితు లై యాపరిచారకులు గజపతిసేనలకడకుఁ బోవుచుండిరి. అంతట గజపతిసైనికులు రాయనిపరిచారకులఁ బట్టుకొని గజపతికడకుం గొంపోయిరి. గజపతిరాజు ఆజాబులు జదువుకొని, తనసేనానులవర్తనమున కత్యాశ్చర్యము నందెను. ఆ జాబులలోని యంశము లెట్లు నున్న వనఁగా :-

"కృష్ణరాయలు మీరుకోరినపద్ధతుల కంగీకరించె ననియును, ఆపద్ధతులప్రకారము మీరు గజపతిరాజును దనకు నప్పగించెద రేని యిదివఱలో నిర్ణయమైనప్రకారము గ్రామములును, ధనమును, ఆభరణాదికములు మీపరము చేసెదము" అని తిమ్మరుసు వ్రాసినట్లుగా నున్నది. ఇట్లున్న జాబులం జదువుకొని గజపతిరాజు తాను పట్టుబడకుండు నుపాయ మాలోచించుచు నితరులకుఁ దెలియకుండఁ గొంతదూరము నం దున్న యొకస్థలమునకుఁ బోయి రహస్యముగా నుండెను. పైసామంత ప్రభువు లట్టితఱిలో గజపతిరాజు యుద్ధభూమియందుఁ గానరాకుండుటం జేసియు, నతనిక్షేమము తెలియకపోవుటంజేసియు యుద్ధము చాలించిరి. అట్టి సంగతిం దెలిసికొనిన వాఁడు కావునఁ గృష్ణరాయలు