పుట:Kavijeevithamulu.pdf/542

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

536

కవి జీవితములు.

నందిరి. అటుతరువాత కృష్ణరాయ లచ్చటనుండు పర్వతదుర్గముం బట్టుకొని తనజయ స్తంభము నచ్చోట నాటించెను. కృష్ణరాయల, సేనలు గజపతిదేశమున కింకను నడుచుచునేయుండఁగా నతనిమంత్రి యగుసాళ్వ తిమ్మన్న కృష్ణరాయనితో నిట్లనియె. గజపతిని మనము నిస్సంసయముగా జయించఁగల్గినను, అతని దేశమునకుం బోవుమార్గ మతిదుర్గమముగా నుండుననియు, ఆకారణముచేత నాప్రదేశములలో జరిగెడుయుద్ధ మతికష్టతరముగా నుండుననియు, కావున నోఢ్రరాజుతో సంధిచేసుకొనుట తగ వని నిశ్చయించి చెప్పెను.

అట్టి మంత్రివాక్యలముకు సమ్మతించినివాఁ డై కృష్ణరాయ లిట్లనియె. అడవియున్న దని చెప్పితివి కావున నది నఱికింపవచ్చును. గజపతి రాజును జయించుట యొక గొప్ప కార్య మనవలసినది లేదు. అతనిని సులభముగా జయించఁగలము. అని యిట్లుగా మంత్రివాక్యముల నిరాదరణచేయుటయేకాక కృష్ణరాయ లహంకరించి సేనలను ముందుకు నడిపెను. ఇట్లుండ మార్గమధ్యములో నుండెడు శిదావుఖాన్ అనునతఁ డఱువది వేలు (60 వేలు) ధానుష్కులతో వచ్చి యెదిరించెను. అతఁడు గజపతిరాజునకు జయము సమకూర్చుటకు నాయ త్తపడి యుండెఁగావున నాయుద్ధము కృష్ణరాయని కతికష్టసాధ్య మాయెను.

కృష్ణరాయలు సమీపించుచుండె ననువర్తమానము నోఢ్రరాజగుగజపతికి వచ్చి చేరెను. అపు డారాజుయొక్క మంత్రులు తమకు సహాయముగాఁ దురుష్కసామంతుల సేనలం గూర్చుకొనుట కర్జ మని విన్నవించిరి. ఇంతియకాక గజపతి చుట్టునుండుసామంతులలోఁ బదియార్గురు లేచి కృష్ణరాయని సేనలతో యుద్ధము చేయ ననుజ్ఞ యిప్పింపుఁడని గజపతితోఁ బ్రార్థన మొనరించిరి. గజపతి రాజును దానికి సమ్మతించి యుద్ధమున కనుజ్ఞ నిచ్చెను. అపుడు గజపతిసేనలు కృష్ణరాయనిసేనలతో యుద్ధమారంభించిరి. కృష్ణరాయ లిట్లుగాఁ బరసేనలు వచ్చుటకు జంకి నిరుత్సాహుఁడై తనమంత్రి యగునప్పాజీ చెప్పినహిత