పుట:Kavijeevithamulu.pdf/544

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

538

కవి జీవితములు.

తనసేనలను యుద్ధమునకుఁ బురికొల్పక పైసామంతులకు నలజడి కల్గింపక నిల్చియుండెను.

ఇంతలో నప్పాజీ గజపతిరాజు కడకుం బోయి కృష్ణరాయ లాతని యోగక్షేమ మరయుటకుం బంపె నని వర్తమానంబుపనిచె. అట్టి మాట యెట్టిదో యని గజపతి కొంతవఱకు సందేహించి కృష్ణరాయలు న్యాయ మైనరా జగుటచేత నమ్మఁదగినవాఁడుగా నిశ్చయించి అప్పాజీకి సమయ మిచ్చి అతని రాయబారము విని సంతసించి అతనికి విశేషబహుమతులు గావించె. అపుడు తిమ్మరుసు రాయలయోగక్షేమము గజపతికిం దెల్పి రాయలకు మీకొమార్తె నిచ్చి వివాహముచేయుఁ డని గజపతికి విన్న వించిన దానికి గజపతియును నంగీకరించెను. అప్పాజీయు నట్టి వృత్తాంతమున కెంతయు సమ్మతించి అట్టి సంబంధ మవశ్యము జరుగవలసినదిగా బలపఱచి చెప్పెను. పిమ్మట నోఢ్రరాజుకోర్కెపైని యప్పాజీ అతనితో నగరులోనికి బహుమతుల నందుకొనుటకుం బోయెను. ఇట్లుగాఁ బోయి అచ్చట నప్పాజీ రాజ కుమారికం జూచుట కనుజ్ఞాతుండయి యా పెను వీక్షించి తిరిగి వచ్చెను. అట్టిసమయములో గజపతి పుత్త్రి యగుతుక్కారా మనుచిన్నది తనతండ్రి కడ కొకచిలుకం బంపెను. ఆ శుకమును గజపతి అప్పాజీద్వారముగఁ గృష్ణరాయనికడకుం బంపెను. రాయనిదరి నిల్చి యాకీరము తన్నుం బంపిన గజపతి పుత్త్రికయొక్కవిద్యా, రూప, లావణ్యాదికములు రాయనికిఁ దృప్తికర మగునట్లు చెప్పెను. అనంతరము కృష్ణరాయ కళ్యాణములో జరిగిన విశేషములును, రాయలు విజయనగరమునకుఁ దిరుగఁ జనుటయు వివరింపఁబడినది.

నోటు :- ఇది కృష్ణరాయ. విజయ కథాసంగ్రహము. ఫిరిష్తా (Ferishta) అను తురుష్కు చారిత్రకారుఁడును కృష్ణరాయలు తురుష్కులబహుధా పరాజయము నందించె ననియు నొప్పికొని యుండెను. కృష్ణరాయని మంత్రియొక్క యథార్థమైన నామము సాళ్వతిమన్న యనియు, అప్పాజీ అనుపేరు వ్యవహార మగుననియుం జెప్పెను. కృష్ణ