పుట:Kavijeevithamulu.pdf/537

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ్రీ కృష్ణదేవరాయలు.

531

చెను. అపు డాజాతివారు దానింజేయమని తిరస్కరించి పలికిరి. దానికిం గోపించి కృష్ణదేవరాయలు వారిపై దండెత్తిపోయెను. ఆ యిర్వురకు నాఱుమాసములు మహాయుద్ధమాయెను. అందు పైజాతిప్రజ లనేకులు కృష్ణరాయని వలన సంహరింపఁబడిరి. అపు డాప్రజలు కృష్ణరాయనితో సంధిగావించుకొనుట మంచిదిగా నెంచి కృష్ణరాయనియాజ్ఞాను సారముగ నగ్రహారము కట్టి యిచ్చుట కంగీకరించిరి. ఇదియునుగాక రెండు సత్త్రములును గట్టి యం దొకదానికిఁ గృష్ణరాయని నామ ముంచి ప్రకటించిరి.

page 524

కాంచీపురముయొక్క కైఫీయతులో జైనులను శంకరాచార్యుల వారు కొట్టి హిందూమతమును స్థాపించె ననియు నిప్పటికిని జైన కాంచి యనుచిన్న యూ రున్నట్లును, జైను లచ్చో నున్నా రన్నందులకు గృష్ణరాయనివలనఁ గట్టింపఁ బడిన గోడలలోపలను, దేవళములలోపలఁ గూడ జైనవిగ్రహములు లుంచఁబడియున్నవి.

కృష్ణరాయ విజయకథా సంగ్రహము.

1. తురుష్కులను జయించుట, 2. ఒరిస్సారాజుకూఁతుం బరిణయమగుట, 3. సింహాసన మెక్కుట, 4. గజపతిని క్షమించుట, 5. తురుష్కులపై యుద్ధమునకు వెడలుట, 6. సేనానులు లోఁబడుట, 7. అహమదు నగరమును గై కొనుట, 8. గుణాగుణ విచక్షణము, 9. సాళువ తిమ్మరుసు (లేక అప్పాజీ) అను నతఁ డతనిమంత్రి, 10. శిదావిఖాన్ తో ఘోరముగాఁ బోరాడుట మొదలగు నంశము లున్నవి.

ఈ గ్రంథము కృష్ణదేవరాయలు తురుష్కులతోఁ జేసిన యుద్ధ వివరమును, తరువాత వారిం జయించిన రీతియును, గజపతిరాజు అనఁగా నోఢ్రరాజు కుమార్తెను కృష్ణరాయలు వివాహము చేసికొనివారితోఁ జేసిన సంధివిశేషములను విస్తరించుటకునై యున్నది. తురుష్కు