పుట:Kavijeevithamulu.pdf/538

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

532

కవి జీవితములు.

లను జయించిన పిమ్మట వారితో స్నేహముగా నున్న గజపతి అధికారము తగ్గించుట అవసర మని కృష్ణదేవరాయని వలన నూహింపఁబడెను. మొదటయుద్ధారంభమైనది. కాని యితరచిక్కులు కల్గుటచేత రాయని యొక్క ముఖ్య మంత్రి యగుఅప్పాజీ చెప్పిన ఆలోచనము ననుసరించి గజపతితో సంధిచేయుటకుఁ బ్రయత్నము చేయంబడెను. అపుడు గజపతి తనకుమార్తెను కృష్ణరాయల కిచ్చి వివాహముచేయుట కంగీకరించెను. అటుపిమ్మట దేశానుచారముగఁ జిలుక రాయబారము వచ్చినట్లును అది రాయనితో గజపతి కూఁతువృత్తాంతమును సౌందర్యాదులును జెప్పినట్లు నుండి పిమ్మట అట్టి వృత్తాంతముల ననుసరించి వివాహమును జరుపఁబడె నని యున్నది.

కథావిశేషములు.

ఈ గ్రంథము వెంగయ్య కవివలనఁ జేయంబడినది ఇతఁడు కాలయ యను నతని కుమారుఁడు. హరిహడిచిన వేంకటభూపాలుఁ డీగ్రంథమునకుఁ గృతిపతి. అతఁడు కృష్ణరాయని చారిత్రమంతయుఁ గావ్యముగాఁ జేయంగోరెను. గ్రంథారంభములో విజయనగర పట్టణముం గూర్చి వ్రాసెను. అనంతరము కృష్ణరాయని తండ్రి యగునరసింహరాయని చారిత్ర విశేషములు వివరింపఁబడెను. అటుపైని నరసింహరాయఁడు విద్యారణ్యస్వామియొక్కయు విరూపాక్షేశ్వరుని యొక్కయుఁ బ్రభావముం గూర్చి నంప్రశ్నించినట్లును, దానికి సమాధానము చెప్పుటలో విజయనగరము కట్టుటకు పూర్వ మున్న విద్యారణ్యుని చర్యలును వివరింపఁబడినవి. అవి యన్నియు నీక్రింది విధంబుగా నుండును ఎట్లన్నను :-

ఈశ్వరుఁడు విద్యారణ్యుల యవతార మెత్తెను. ఆ విద్యారణ్యు లనంతరము శంకరాచార్య పీఠా రోహణముం జేసెను. విద్యారణ్యులు లక్ష్మినిగూర్చి తపస్సు చేసి ఆమెకటాక్షము నంది ఆయడవిలో నొకపట్టణము తనపేరిటఁ గట్టెను. అది లక్ష్మికి నివాసస్థానముగాఁ జేయంబ