పుట:Kavijeevithamulu.pdf/536

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

530

కవి జీవితములు.

బాలించిరి. ఒకబీద పురోహిత బ్రాహ్మణుఁడు తిరువల్లేశ్వర కోవెలకు వచ్చెను. వచ్చి కల్లత్తూరులో నొకభూమిని నిలిచెను. దేవుఁ డొకనాఁ డా బ్రాహ్మణునకుఁ గాన్పించి యాభూమి దున్నించినపుడు తనతోఁ జెప్పమనికోరెను. ఆబ్రాహ్మణుఁడు నట్లు కావించెను. అపుడు దేవుఁడువాహనముపై నెక్కివచ్చి గుప్పెడు విత్తనములు చల్లి అంతర్ధానము నందెను. తక్కిన విత్తనము లాబ్రాహ్మణునివలననే విత్తఁబడెను. ఆ నస్యము మిక్కిలి గోవగా నెదిగెను. ఆచుట్టపట్ల నుండెడు నితరుల నస్యములు నీరసముగా నెదిగెను. బ్రాహ్మణుని సస్యము మనుష్యున కందనంత యెత్తు ఆయెను. కాని వెన్ను మాత్రము వేయక యుండెను. దాని కా బ్రాహ్మణుఁడు మిక్కిలి చింతించెను. త్రోవంబోవు నొక వెల్లాలరు వాఁడు పైసస్యముయొక్క యొక దంటు తీసి విప్పిచూచెను. అపుడందులో నొకబంగారువె న్నుండెను. అంతట వాఁ డాబ్రాహ్మణునితోఁ దనసస్యముతో నతని సస్యము మార్చుకొ మ్మని కోరియొప్పించి దానికి వ్రాఁతమూలముల నేర్పఱచెను. ఇట్లుండఁ జిర కాలమున కాసస్యము వెన్నులు వేసెను. భూమియును బంగారురంగును బూనెను. ఆ వృత్తాంత మాకాలములో నాదేశముం బాలించుచుండిన హరిహరరాయలు విని సేనాపరివృతుఁ డై వచ్చి సస్యముం గోయించి నూర్పించి దానిని విభాగించి యొకపాలు వ్యవసాయకునకు, నొకపాలు భూస్వామికి, నొక పాలు రాజునకు నిర్ణయించి యెవరిది వారి కిచ్చి తనపాలు తాను గైకొని పోయెను. పైదదినును యిటుకలతోఁ గట్టఁబడిన చప్టాపై నూర్చఁ బడినది. అచప్టా కే కళ్ల మని పేరు. దానింబట్టి ఆ గ్రామమునకు వన్‌వెలెనాత కళ్లత్తూరు, అనగా బంగారు సస్యముగఁ బండునది. అని యర్థము. పైగ్రామములోని కోట తొండమాను చక్రవర్తి కాలము మొదలు కృష్ణరాయని కాలమువఱకును వెల్లార్ హర్, అనఁగా వ్యవసాయదారులను జాతివారి క్రింద నుండునది. ఆ జాతివారితోఁ గృష్ణరాయలు బ్రాహ్మణుల కొక యగ్రహారము కట్టి యియ్యమని ఆజ్ఞాపిం