పుట:Kavijeevithamulu.pdf/533

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ్రీ కృష్ణదేవరాయలు.

527

బోయి కప్పముల నిర్ణ యించి వచ్చెను. తంజావూరు, తిరుచునాపల్లి, మధుర, తిరునగరు రాజులు పైసర్దారుని యిష్టానుసారముగా వ్యవహార కట్టుబాటులకు నంగీకరించిరి. ఈప్రకారముగాఁ దూర్పున నుండుకర్ణాటకదేశము (మయిసూరు మొదలగునవి చేరని దేశము) రాయలయధికారముక్రిందికి వచ్చెను. ఈ దేశమువలన రాయలకు మూఁడు కోటులు రూపాయిలు వచ్చెడివి ఆ దేశమంతయు మూఁడుఖండములు గా నేర్పఱుపఁబడినది. ఆమూఁటిని బరిపాలించుటకు మువ్వురు పరిపాలకులు (Governors) నియమించఁబడిరి. జింజీలో నుండుకృష్ణప్పనాయకుఁడు నెల్లూరు మొదలు కొల్లడం (Colaroon) నదివఱకును బరిపాలించుచుండెను. తంజావూరిలో నుండెడు విజయరాఘవుఁడను. నతఁడు కావేరినది ప్రవహించుటవలన ఫలవంత మై యుండినదేశ మంతయుఁ బాలించెను. దానికి దక్షిణమం దుండుదేశమంతయు వేంకటప్పనాయకునివలనఁ బాలింపఁబడెను. ఇట్టిరాయల యధికారము జెడఁగొట్టుటకు దురుష్క ప్రభువులు కొంద ఱేకీభవించిరి. రాయలతాలూకు రాజప్రతినిధి (Viceroy) అతనిసేనలతోగూడ రాయలసన్నిధికిం బోవ నాజ్ఞాపింపఁబడెను. అది మొదలు జింజీలో నున్న తుపాకీనాయకరు తనస్వాతంత్ర్యముం బ్రకటింప నారంభించెను.

page 69 I

కృష్ణరాయనికిఁ గల్గినశాసనము.

ఆనిగొందెకైఫీయతులో నీక్రింది వృత్తాంతము లున్నవి -

కృష్ణరాయలు నర్మదానదికి దక్షిణమం దుండుదేశమంతయు జయించెను. అతనికి లక్షసేన లుండెను. ఆనిగొందె సర్కారునకు లోఁబడియుండెడు నొకసామంత్రప్రభుఁడు దానిక్రింద నుండునిరువదికోటలు గల దేశమును బాలించుచుండును. కృష్ణరాయని యేనుఁగులబలమంతయు నతనివశములోనే యుండెను. అట్టి సామంతప్రభుఁడు కృష్ణరాయనివలన నొక సమయములో నానె గొందె విడిచి మఱియొక స్థలమున