పుట:Kavijeevithamulu.pdf/532

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు
526
కవి జీవితములు.

వాడుక గలదు. ఇందు కొక దాఖలా యున్నది. అది యెద్దియనఁగా నీగ్రామముయొక్క పొలిమేరలోని రాళ్లపైని జమ్మాపురమునకుఁ బ్రతినామ మగు శ్రీరామానుజపురము (కృష్ణరాయపురము) పొలిమేర అని వ్రాయఁబడియున్నది.

page 39.

కృష్ణరాయలు కర్ణాటకదేశమును జయించి విభజించుట.

కర్ణాటక రాజ్యవృత్తాంతములో వీరవిజయరాయలాదేశమునకుఁ ప్రభుఁడుగా నున్నట్లు కలదు. వెల్లాలరాయన్ ఫసలీ 750 లో వ్యవహరించెను. త్రినామలిగుడుకిఁ గొన్ని కార్యముల నతిశయముగాఁ జేసెను. అతఁడురాయల వంశస్థులకుఁ బన్ని చ్చు చుండెను. అతఁడు పడిపోయిన యనంతరము దేశము చిన్న చిన్న ఖండములుగా విభాగింపఁబడి ప్రత్యేక ప్రభువులస్వాధీనమాయెను. అనంతర మది కృష్ణరాయనికి స్వాధీనపడెను. ఇతఁడు కర్ణాటకదేశమున నొక గొప్పసేనను బంపెను. అది 1,00,000 (లక్ష) జనము కలదై యుండెను. దానిలోని సేనాజనులు. 1. విజయప్పనాయఁకుడు, 2. తుపాకీ కృష్ణప్పనాయకుఁడు, 3 విజయరాఘవనాయకుఁడు, 4 వేంకటప్పనాయకుఁడు, నై యుండిరి. ఫసలీ 870 లో విజయనాయకర్ విశేషముగాఁ బన్ను వసూలుచేసెను. అతఁడు వెల్లూరికడ విడిసియుండెను. చిత్తూరి పాలెగాఁడును తొండ్రమండలములోని యితర పాలెగాండ్రను విజయప్పనాయకునితో బేటీ చేసిరి. అతఁడు పైవారలు ఇడ్చుకోవలసిన పన్నులు నిర్ధారణచేసెను. ఇతర పాలెగాండ్రతోటిపాటు కాళహస్తిప్రభుఁడగు బొమ్మిరెడ్డి వృత్తాంతముగూడ జెప్పంబడెను. రాయలయొక్కసర్దారుఁడు వేలూరిమండి జిఁజీపట్టణమునకుం బోయెను. చోళమండలములోని పాలెగాండ్రు ఆసర్దారుని గలుసుగొనిరి. అప్పటిలో వా రియ్యవలసిన కప్పములు నిర్ణయించఁబడెను. విజయప్పనాయకుఁడు జింజీలోనే తన సేనలతో నుండెను. అతఁడు దానిక్రింద నుండు ప్రభువు లగు పాండ్య, చోళ, చీరరాజుల దేశములకుం