పుట:Kavijeevithamulu.pdf/534

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు
528
కవి జీవితములు.

కుం బోవ నాజ్ఞాపింపఁబడియెను. ఆవృత్తాంతము వినినయిర్వురు గోసాయీలు కృష్ణరాయనితో నాసామంతప్రభుఁడు ధర్మాత్ముఁడనియు నతనిని దేశాంతరమునకుఁ బంపకుఁ డనియు విన్న వించుకొనిరి. కృష్ణరాయలు కనికరము లేనివాఁ డై సాధులబోధ లక్ష్యములేనివాఁ డై ఆసామంతుఁడు దేశాంతరము పోక తప్ప దనితీర్మానించెను. అపు డాయిర్వురుమహాత్ములును గృష్ణరాయనికిఁ గొన్నినీతు లుపదేశించిరి. అట్లివానిని వినియైనను లక్ష్యముసేయక కృష్ణరాయలు వారిని వదలి పొ మ్మని యాజ్ఞచేసెను. అపుడాసాధువులు కోపముతోఁ గృష్ణరాయలు సంతానహీనుఁ డౌఁగాక యనియును, అతని సింహాసన మెక్కుటకు న్యాయమగువారసుఁ డుండక పోఁగాక యనియు శపించిరి. వారిశాపానుసారముగనే కార్యములుజరిగె నని కలదు.

కృష్ణరాయని యల్లునకుఁ గల్గినలోపము.

ఇటులనే కృష్ణరాయని యల్లుఁ డగు రామరా జధికారము చేయు చుండఁగా నొక తురుష్కుఁడు (ఫకీరు) హిందువులు గౌరవించెడు నొక సరస్సులో స్నానముఁ జేయుచుండెను. అపుడు రాజభటు లా ఫకీరును బట్టుకొని రామరాజుకడకుం గొంపోయిరి. ఆఫీకీరుతో నతని మతస్థు లిర్వు రుండిరి. అపుడు రామరాజు వారి మువ్వురం గొట్టించి వస్త్రవిహీనులం జేసి వారిని ప్రాణములతో వదలిపెట్టెను అపు డాఫకీరులు ఢిల్లికిఁ (ఆకాలమున తురుష్కప్రభువుల రాజధాని) బోయి విజయనగరమును స్వాధీనము చేసికొనిననాఁడు ఢిల్లీప్రభువులు తురుష్కమతస్థులు కాకపోదు రని వట్టు బెట్టిరి. ఇట్లు ఫకీరులు పెట్టిన మొఱ లాలించి ఆతురుష్క ప్రభువు లపుడే విజయనగరముపై దండెత్తుటకు సన్నాహములు చేయ నారంభించిరి, పిమ్మట విజయనగరము వారివలన ముట్టడింపఁబడెను. అది అయినపిమ్మట రామరాజు వంశస్థులలో మఱికొందఱు ఆనె గొందెపైఁ గొంతకాలమువఱకును గొంచె మధికారము కల్గియుండిరి. రామరాజువంశస్థులలోనివారు టిప్పుసుల్తానుకాలములో నానెగొందె విడిచి షోలాపురమునకు లేచిపోయిరి. వా రిప్పటికి నచ్చటనే యున్నారు.