పుట:Kavijeevithamulu.pdf/529

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ్రీ కృష్ణదేవరాయలు.

523

లోఁ గృష్ణరాయని దిగ్విజయవిశేషములు సంగ్రహముగా వివరించఁబడినవి. గజపతిరాజు తనకొమార్తెను కృష్ణరాయని కిచ్చి వివాహము చేసి సంధి చేసుకొనె నని చెప్పవలసియున్నది. కృష్ణరాయని మరణకాల మందులో శా. స. 1442 (A. D. 19th november 1531) కార్తిక శు. 8 అనీ యున్నది. ఈతేదీ పొరపాటు కావచ్చును.

శా. స. 1443 (A. D. 1531)

వల్లభాపురములో కృష్ణదేవరాయనివలన తుంగభద్రానదికి అడ్డముగా వంతెన కట్టఁబడినట్లున్నది. ఇది శా. స 1443 లో జరగినది. దీనికి దాఖలా ఆవంతెనకు రెండు వైపుల నుండు రాళ్లపైని శాసనములు చెక్కఁబడినవి.

page 484.

కృష్ణదేవరాయలు పెక్కు కోటలం బట్టుకొనుట.

ఓరుగల్లు రాజులవృత్తాంతములోఁ గృష్ణరాయలు విజయనగరములో రాజ్యము చేయుచు కొండవీడు, కొండపల్లి, ఇనమకొండ, బలవకొండ, నాగార్జునకొండ, మొదలగు కోటలను బట్టుకొనియెను. అతఁ డోరుగల్లులో నుండుతురుష్కులం జయించి ఆస్థలము నాక్రమించుకొనియెను. అతఁడు తాకతీయవంశస్థులకు భుక్తికి సరిపడుమట్టుకు నిచ్చెను. అచ్యుతరాయనికాలములోఁ గూడ నోరుగ ల్లతనిక్రిందనే యుండెను. రామరాయలును సదాశివరాయనితో సమానాధికారిగా నుండెను.

page 656.

కృష్ణరాయలు తనరాజ్యమును దొమ్మిది ఖండములు చేయుట.

కమలాచల నామాంతరము గలగోవిందగిరి కైఫీయతు.

గోవర్ధనగిరిచుట్టును ఎనిమిదికొండలు గలవు. ఇవి యన్నియుఁ గలిసినచో నాపర్వత మష్టదళపద్మమువంటి యాకారము కలదిగాఁ గానుపించును. ఈదేశములో నెనుబదియొక్క (81) కోటలు గలవు. వీనిని ప్రాచీనకాలములో మకుటవర్థనరాయఁడు, విక్రమార్కుఁడు, శాలివాహనుఁడు