పుట:Kavijeevithamulu.pdf/528

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

522

కవి జీవితములు.

ర్వ మిరువదియైదు సంవత్సరముల క్రిందట నొకరెడ్డి అక్కడ కోటఁ గట్టించినట్లు వాడుక గలదు. అపు డాకాలము శా. స. 1485 సమీప కాల మగును. కృష్ణరాయ లీయూర నుండుసూర్యగుంట చెర్వు త్రవ్వించెను. ఆయనభార్య కృష్ణాజీ అమ్మ యొకగ్రామమును రెండు దేవాలయములును దీని సమీపమునఁ గట్టించెను. మఱియొక కథలోఁ గృష్ణరాయని చాకలివాఁడును, బారికవాఁడును గొండపై పై నుండుకోటలఁ గట్టినట్లు వాడుక గలదు. వారిపేరిటనే అవి నేఁటివఱకుం బిలువఁబడుచున్నవి. మఱి కొందఱి మతములో నీరెండు కోటలును మహారాష్ట్రులవలన గట్టబడినట్లున్నది.

వురటూరు గ్రామమునకుఁ దూర్పు రెండు పరువుల దూరమున కోడూరు గ్రామము మజరా భూమెపల్లిగ్రామము శ్రీకృష్ణరాయలకుఁ గొడుగుపట్టెడు గొడుగుభూమానాయఁడు అనునాయన కోడూరు గ్రామమున కాగ్నేయభాగము సామీప్యమున తనపేరితో పల్లెకట్టించి తెలికెచెర్ల గోపాలాచార్యులకు నేకభోగసర్వమాన్య అగ్రహారములో నిచ్చెను. ఇందుకు దాఖలా యీ భూమిపల్లె పొలిమేరలో వలయ వామన ముద్ర చెక్కి దిగువ వ్రాసియుండునది :-

"శ్రీమతేరామానుజాయనమః తెలికచెర్ల గోపాలాచార్యులకు నేకభోగపుసర్వమాన్యము అగ్రహార మైన భూమానాయని పల్లెకు ప్రతినామ మైన వేదాంతాచార్యపురమునకు వలయశాసనము వామన ముద్ర స్తంభము."

చంద్రగిరిపరిపాలకుల హకీఖత్తు యాదవవంశస్థుల చరిత్రముగా కృష్ణరాయలవంశములో నుండెడు రాజుల చరిత్రములం జెప్పెడు వ్రాఁతమూలములాకోట నున్నవి. వానినుండి సంగ్రహించఁబడినది, తరువాత కాలములో యాదవరాజులలోని యొకప్రభుఁడు విజయనగరము దండయాత్రకై యత్నించి కృష్ణరాయని అధికారబలములను, అతని రాఁబడిని తెలుసుకొని యాప్రయత్నము మానుకొనియెను. అందు