పుట:Kavijeevithamulu.pdf/530

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

524

కవి జీవితములు.

అను రాజులు పాలించిరి. శకవత్సరము ప్రారంభమైనపిమ్మట దక్షిణదేశమున కధిపతులు విజయనగరములో నుండెడు నరపతిరాజులై యుండిరి. ఈ వంశములో నఱువదినల్గురు (64) పురుషు లుండిరి. (ఇది తప్పుగాఁ దోఁచును) ఆయఱువది నల్గురిలో నరసింగరాయఁడు ప్రథానుఁడు. ఇతఁడు యాదవ వంశస్థుఁడు. విజయనగరముం జయించెను. అతఁడు తనస్వాధీనములో మూఁడుకోట లుంచుకొనెను. నరసింగరాయని కుమారుఁడు కృష్ణరాయలు అతనిమంత్రి సాళ్వతిమ్మన్న. అతని సహాయము వలనఁ గృష్ణరాయలు నలుబది (40) కోటలం జయించెను. శా. స. 1481 (ఇది శా. స. 1451 - 2 కావలెను) వఱకును రాజ్యము చేసెను.

కృష్ణరాయలు దేశమంతయు నొక్కఁడుగాఁ బాలించుటకు నది విస్తీర్ణతలో మిక్కిలి అధికమౌటచేఁ దనమంత్రి నడిగి యతని యనుమతిపైని దానినంతయుఁ దొమ్మిది ఖండములుగా భాగించి యొక్కొక రాజప్రతినిధిని (Viceroy) నియమించి పంపెను. ఇట్టిఖండములలోఁ గర్ణాటదేశ మొకఖండ మైయుండెను. దీని పరిపాలక రాజప్రతినిధి (Governor and Viceroy) ధర్మానాయకుఁడు. అతని వంశస్థులు శా. స. 520 మొదలు శా. స. 688 వఱకు నుండిరి. (ఇందలికాలనిర్ణయము తప్పు)

శా. స. (670 మొదలు 710 వఱకును ద్రవిడదేశము గొండ చోళరాయలు పై తొమ్మిదవ ఖండము గైకొనెను. శా. స. 711 మొదలు 720 వఱకును బాలించెను. పర్వతరాయలు శా. స. 721 మొదలు 780 వఱకును, గోవిందరాయ, అచ్యుతరాయ, విద్యాధరరాయ లనువార శా. స. 781 మొదలు 900 వఱకును బరిపాలించిరి. చిక్కరాయలు 901 మొదలు 970 వఱకుం బాలించెను. శివానీసముద్ర మాధవరాయలు శా. స. 971 మొదలు వేంకటపతివఱకును, అతనివంశములో (1050) వేంకటపతిరాయలు వ్యవహరించెను. సోమశేఖరరాయలు 1081 మొదలు 1110, ఆనె గొందె