పుట:Kavijeevithamulu.pdf/520

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

514

కవి జీవితములు.

వారిలోఁ గృష్ణరాయనితో నెదిరించుటకుఁ దగిన స్థితిలో నున్నవాఁ డీరాచిరాజొక్కఁడే. ఇతనినే వెలమలలో రావువారి వంశచారిత్రములో పూసపాటి మాధవవర్మ యని వివరించిరి. ప్రస్తుతములో నీసంశయ నివారణ చేయుట మనపని కాదు గనుక నీవిషయమై చర్చింపక రాచిరాజు కృష్ణరాయలతోఁ బలము సాధించి పోరుటకుం గలకారణముమాత్రము వివరింపవలసియున్నది. దానికిఁ గారణము రాచిరాజు కేవలశూరుఁ డగుటయేకాక కృష్ణరాయనివలనఁ బరాజితుఁడైన పైవీరరుద్ర గజపతి కుమారుఁడగు వీరభద్ర గజపతియొక్క తోఁబుట్టువునకు భర్తయై యుండుటయు కొండవీటిలోని కేతవర దుర్గాధ్యక్షుఁడై యుంటయు నై యున్నది. అట్టిసంబంధ మున్నందులకుఁ గృష్ణవిజయములోని యీక్రింది పద్యము చాలియుండును. ఎట్లన్నను :-

సీ. నవభారతాఖ్యాననవ్యకావ్యమునకు, నాయకుం డయ్యె నేనరవరుండు
    కటకేశ్వరునిచేతఁ గని కేతవర మాత్మ, పురముగా నేలె నేభూవిభుండు
    నిలి పె భారుహమన్నెనృపగండపెండేర, మెపుడు డాకాల నేనృపతిమౌళి
    యఖిలసద్గుణపతి యక్కమాంబాదేవి, ప్రాణేశుఁడయ్యె నేపార్థి వుండు
    ప్రథితగజపతిరాజ వీరప్రతాప, రుద్రతనయాధినాయకారూఢతమ్మి
    రాజజనకతఁ గాంచె నేరాజతిలక, మతఁ డలరుతమ్మవిభురాచయప్రభుండు.

దీనింబట్టి రాచిరాజు వీర రుద్ర గజపతి యల్లుం డై, అతని కుమారుం డగువీరభద్ర గజపతికి బావమఱఁది అయియున్నాఁడు. వీరభద్ర గజపతి కృష్ణరాయనికి స్వాధీనుఁడైనను నీరాచిరాజు వీరరుద్ర గజపతి సేనలను వెంటఁ దీసుకొని బెజవాడ, వేఁగిదేశములకుఁ బోయి అక్కడ నుండు చిన్న సంస్థానములను దోఁపిడిచేయుచుఁ గృష్ణరాయనికి దూరదూరమున నున్నట్లుగా మఱికొన్ని కైఫీయతులవలనం గాన్పించు. అందులో నొకదానిలో నీపైవిషయముతో పాటు కృష్ణరాయల తూర్పుదేశపు దండయాత్రా విశేషములును ఇదివఱలో మనము వ్రాయుచున్న పాత్రసామంతాదుల స్థితిగతులును, వారిని కృష్ణరాయలు పట్టిన తెఱఁగును విస్పష్టముగా నున్నది. గనుక ఆవృత్తాంతము మట్టుకు