పుట:Kavijeevithamulu.pdf/519

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ్రీ కృష్ణదేవరాయలు.

513

యును మనచరిత్రమునకు ముఖ్యములే. వాని నీక్రింద వివరించెదను. ఎట్లన్నను :-

శా. స. 1430 - క్షత్త్రియవంశస్థుఁ డగుసాళ్వనరసింహరాయలు ప్రబలెను. ఇతనిమంత్రి సాళ్వతిమ్మయ, ఈనరసింహరాయల యనంతరము కీర్తికాముఁ డగుప్రతాప వీరకృష్ణరాయలు ప్రభుత్వమునకు వచ్చెను. ఇతని మంత్రి అప్పాజీ. కృష్ణరాయలు విభవసంవత్సరమాఘ శు. 14 పట్టాభిషిక్తుఁడాయెను. ఇదే శక సంవత్సరము. (Note ː- ఇందులో వ్రాయంబడిన నరసింహరాయలు కృష్ణరాయని యన్న యగువీరనరసింహరాయలు.)

1435. సుల్తాన్ కుల్లీ ఖద్భుల్ ముల్కు, ఢిల్లిపాద్షాతో యుద్ధము ప్రారంభించి ఆంధ్రదేశమును స్వాధీన పఱుచుకొనియెను.

1435. అమీనాబాద్ బీదర్ ప్రదేశములయందు ప్రారంభింపఁబడినయుద్ధములో మహమ్మదు పాదుషా పరాజితుఁడైనాడు.

1435. కళింగదేశము నేలుచుండిన వీరభద్ర గజపతిరాజును కృష్ణదేవరాయలు జయించెను.

1437. పూసపాటి మాధవవర్మ వెలమవారికి అనేక దుర్మార్గములు చేయు చుండెను.

1441. కృష్ణానదివడ్డున ప్రబలయుద్ధము జరిగినది. అప్పటిలో విజయనగరము నేలుచుండు కృష్ణదేవరాయలను అదిలిషా యెదిరించినందున వారిని కృష్ణదేవరాయలు జయించి తఱిమెను.

1445. విరింజిపురం అప్పయ్య దీక్షితులును, కోటి కన్యాప్రదానముల తాతాచార్యులను పండితుఁడును ప్రబలిరి.

1450. వీరభద్ర ప్రతాపదేవులు కటకమును పాలించెను.

1452. జగదేకప్రసిద్ధుఁ డగుకృష్ణదేవరాయలు మృతి నందెను. గోలకొండలో తానీషా ప్రభుత్వము ప్రారంభించఁబడినది.

అనియున్న పైపట్టికలో పూసపాటి రాచిరాజు విషయము వ్రాయవలసియున్నది. పైదానిలో వ్రాయంబడిన పూసపాటి మాధవవర్మ యే యీ పూసపాటి రాచిరాజు పూసపాటి వారివంశముం జెప్పెడు కృష్ణవిజయాదిగ్రంథములంబట్టి పైరాచిరాజు చేసినవిశేషములు స్పష్టము లగును. ఇపుడు మనమువ్రాయుచున్న కాలములోఁ బూసపాటి