పుట:Kavijeevithamulu.pdf/482

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

476

కవి జీవితములు.

రాఘవపాండవీయకళాపూర్ణోదయాదిగ్రంథకర్త యగు పింగళిసూరనయు నష్టదిగ్గజములు. అపరశంకరాచార్య నాముఁడు నశీతిగ్రంథకర్తయైన యప్పయదీక్షితులును, సంస్కృతమహాకవియు, సరసవచనరచనా నల్పకల్పనాచతురుండును ప్రతిభాసమన్వితుండును నగుతిమ్మరుసు మంత్రివర్యుండును, రాజగురుం డగుతాతాచార్యులును, గృష్ణదేవరాయ ప్రసిద్ధాస్థాన పండితు లని వాడుక గలదు. ఇందలి యాంధ్రకవులచే రచియింపంబడిన గ్రంథంబులలో మనుచరిత్రమును బారిజాతాపహరణమును, కవినామంబును, గృతిపతినామంబును, జగద్విఖ్యాతిం గాంచునట్లొనరించె. ఇంకను గొన్నిగ్రంథంబుల కీరాయండు కృతినాయకుండని విందుము. ఆగ్రంథంబు లిపుడు నామావశిష్టంబు లై మనకు లభ్యములు కాలేదు. కొండవీటి దండకవిలెలో నున్న వృత్తాంతమును పురుషార్థప్రదాయిని యీక్రింది విధంబుగఁ బ్రకటించెను.

"ఈకృష్ణదేవరాయలు పిన్నవయస్సులోనే సమస్తశాస్త్రములు నేర్చి అప్పాజీ లేక తిమ్మరుసు అను నాయనవద్ద రాజనీతి దండనీతి మొదలగు విద్యలు గ్రహించె. ఆయన జీవితకాలము యావత్తు ఆంధ్ర విద్యాభివృద్ధికొఱకు పాటుబడుచునుండువాఁడు. ఈయనయొక్క సభయందు అష్టదిగ్గజము లనునామముచేత నెనిమిదిమంది గొప్పపండితులు ప్రసిద్ధిం జెందిరి. అధ్టదిగ్గజముల పేళ్లును, వారిచే రచియింపఁబడినముఖ్య గ్రంథముల పేళ్లును నీక్రింద దెలియఁ జేయుచున్నాను.

కవీశ్వరులపేళ్లు. గ్రంథములపేళ్లు
1 అల్లసానిపెద్దన్న. ఈయన దూపాటి సీమలోని ద్రోణాదుల కాఁపురస్థుఁడు. ఈయనకు నాంధ్రకవితాపితామహుఁ డను పేరు గలదు 1. మనుచరిత్రము, 2. రామ స్తవరాజము, 3. అద్వైతము.
2 భట్టుమూర్తి ఈయన భట్టుపల్లె కాఁపురస్థుఁడు. 1. నరసభూపాలీయము, 2. వసుచరిత్రము.
3 ముక్కుతిమ్మన్న. ఈయన గన్నవరము కాఁపురస్థుఁడు. 1. పారిజాతాపహరణము.
4 పింగళిసూరన్న. రాఘవపాండవీయము.
5 తెనాలి కాఁపురస్థుఁ డగు తెనాలి రామలింగము. ఈయన యింటిపేరు ఈశ్వరప్రెగ్గడవారు. పాండురంగవిజయము. (పాండురంగమాహాత్మ్యము.)
6 సీడెడ్డు డిస్ట్రిక్టు కాఁపురస్థుఁడు రామభద్ర కవి. రామాభ్యుదయయ
7 శంకరకవి
8 ధూర్జటి