పుట:Kavijeevithamulu.pdf/466

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

460

కవి జీవితములు.

6. ఆఱవ యాశ్వాసములో. 1. తపశ్చరణము. 2. అందులో గ్రీష్మ, వర్ష, శిశిరర్తు వర్ణనము. 3. అప్సరస్సమాగమన ప్రకారము. 4. నృత్తప్రపంచము. 5. సముద్రవర్ణనము. 6. వైకుంఠవర్ణనము. 7. భగవద్దివ్య మంగళవర్ణనము. 8. భగవత్ స్తోత్రము.

పైవర్ణన లెట్టు లున్న వనఁగా :-

1. వ దానిలో 3. 2 వ దానిలో 9. 3 వ దానిలో 6. 4 వ దానిలో 12. 5 వ దానిలో 7. 6 వ దానిలో 8. మొత్తము. 45.

ఇటులఁ జేసి తిరుగ నొక్కొకదానిలో ననేక వర్ణనలు చేర్చి చెప్పుటయే కాక నరసింహకవి తిరిగి యొక్కొక వర్ణనలో ననేకభేదములుగూడ కల్పించెను. ఎట్లనగాఁ బురవర్ణనలో కోటలు, కొమ్ములు సౌధములు వర్ణించుటయేగాక బ్రహ్మక్షత్త్రాది వర్ణ చతుష్టయమును, చతురంగబలంబులను, పుష్పలావికాది స్త్రీవర్ణనాంశాదికములం జేర్చి పెంచి చెప్పెను. పారిజాతాపహరణమునకంటె మనుచరిత్రంబునను, మనుచరిత్రమునకంటె నీకవికర్ణరసాయనంబున ననేక విశేష వర్ణనాంశములు కాన నయ్యెడిని. ఇట్టి నరసింహకవి మార్గమునే కై కొని ఆముక్తమాల్యద, వసుచరిత్రము మొదలగు ప్రబంధములు రచియింపఁనడినవి. తదనంతరకాలములోనికవులందఱు నాయావర్ణ నలనే చేయుచు వారిబుద్ధివైశద్యముచేత నాయావర్ణనలలో నింకను విశేషించి గ్రంథము జేర్చిరి. శా. స. 16, 17 శతాబ్దములలోని కవులు పైవర్ణనల నన్నిటిం జేకొనినను శృంగారాదివర్ణనలు ప్రధానములుగాఁ జేసి అందుఁ బ్రఖ్యాతిం జెందిరి. వారిచారిత్రములు మఱియొక భాగములోఁ జేర్పంబడినవికావున నందలి విశేషము లాచరిత్రములలోపలనే వివరించెదను. ప్రస్తుత మీకవిచరిత్రముం జెప్పి మనుచరిత్రమునకు నీకవి కర్ణ రసాయనమునకుం గలశైలీవిశేషములం జూపెదను.

నృసింహకవిచరిత్రము.

దీనిని దెలుపుట కీగ్రంథములో విశేషాధారములు లేవు. ఇతని