పుట:Kavijeevithamulu.pdf/465

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సంకుసాల నృసింహకవి.

459

గీ. ఇందు నొకకొన్ని కడయైన నెంచిచూడ, నదియు నవనిమహాకావ్యమనఁగ బరఁగు
    మఱియు క్షుద్రప్రబంధ నిర్మాణమర్మ, లక్షణము లేర్పఱించెద లలితఫణితి."

మహాకావ్య లక్షణముల వివరించితిగావున నిఁక నట్టివర్ణనలలో నీ నృసింహకవి హెచ్చించి చెప్పిన వర్ణనములం జూపెదను, దానికిఁగాను నరసింహకవివలనఁ జెప్పఁబడిన యాశ్వాసాంత గద్యములే చాలియుండుంగావున నీక్రిందివానిఁ బ్రత్యేకించి చూపెదను. అందులో :-

1. ప్రథమాశ్వాసములో 1. కావ్యారంభము. 2. పురవర్ణనము. 3. నాయకనిరూపణము.

2. రెండవయాశ్వాసములో. 1. రాజనీతి. 2. శరత్కాలవర్ణనము. 3. దండయాత్ర. 4. దిగ్విజయంబు. 5. సేనాసన్ని వేశనిరూపణము. 6. దూతాలాపంబును. 7. వీరాలాపంబును. 8. యుద్ధము. 9. శైలవర్ణనము.

3. మూఁడవ యాశ్వాసములో. 1. నాయికానిరూపణము. 2. యౌవనవర్ణనము. 3. విప్రలంభంబును. 4. ఆ విప్రలంభవర్ణనములో దశదశానిరూపణము. 5. వివాహము. 6. నవనవోఢాసంగమము.

4. నాల్గవ యాశ్వాసములో. 1. వసంతవర్ణనము. 2. వనవిహారము. 3. జలక్రీడ. 4. సూర్యాస్తమయము. 5. తమోవర్ణనము. 6. తారకావర్ణనము. 7. జారవిట విటీవర్ణనము. 8. చంద్రోదయము. 9. మధుపానము. 10. రతినిరూపణము. 11. ప్రభాతవర్ణనము. 12. సూర్యోదయవర్ణనము.

5. అయిదవ యాశ్వాసములో. 1. వసిష్ఠాగమనము. 2. రాజ ప్రశ్నప్రతి వచనంబులు. 3. అట్టిప్రశ్నలలో కర్మస్వరూప బ్రహ్మస్వరూపములు. 4. వేద వేదాంత పురాణ నిరూపణము. 5. భక్తి ప్రపత్తిరూపసాధన నిరూపణము. 6. సంసారనిరూపణము. 7. మోక్షావతరణము.