పుట:Kavijeevithamulu.pdf/464

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

458

కవి జీవితములు.

ము. అట్టిగాథల నిపుడు దొరికినమట్టుకు విశేషములఁ జేర్చి పెంచి వ్రాసెదను. కృష్ణరాయచారిత్రము కేవలప్రభు చారిత్రములలోఁ జేర్చి చెప్పవలసిన దైనను, రాజచరిత్రము లేనిది కేవలకవిచారిత్ర మంత శ్లాఘాపాత్ర మైయుండదు గావున నీ పట్టున రాజచారిత్రములలో నున్న దానిని విడఁదీసి దీనియందే పొందుపఱిచెదను. కావున చరిత్రాభి మాలుబు దీని నంగీకరింపఁ బ్రార్థింపఁబడుచున్నారు.

కవికర్ణరసాయనము.

పైప్రౌఢప్రబంధములలో మొదటిగ్రంథ మగుకవికర్ణ రసాయనమనునీగ్రంథము నరసింహకవి యనునతఁడు రచియించెను. అల్లసాని పెద్దనయు నీతనికిఁ బూర్వులగు కొందఱు కావ్యకర్తలును గనుపఱిచినమార్గములలోని విశేషముల ననుసరించి కేవలము ప్రబంధవర్ణనలన్నియుఁ దెచ్చుటకు నొకకథను విశేషకథాచమత్కృతి లేనిదానిం గైకొని ఆఱాశ్వసములగ్రంథము రచియించెను. ఇట్టిగ్రంథములో నుండు వర్ణనావిశేషములు దెలుపుటకుఁ బూర్వము ప్రబంధావసరము లగువర్ణనలకు నిబంధనపద్యములఁ దెల్పి యనంతరము వర్ణనలలో నెన్ని పెంచి రచియింపఁబడియెనో చూపెదను. ఇతనినాఁటికి లక్షణగ్రంథము కావ్యాలంకార చూడామణి యనంబరఁగు విన్నకోట. పెద్దనకవిరచిత లక్షణ మై యున్నది. కాని అంతకంటె ననంతరకాలములో రచియింపఁ బడిన ప్రతాపరుద్రీయములో నుండువిశేషము లీనరసింహకవికి లక్షములుగా నున్న ట్లూహింపఁబడును. అది నరసింహకవికాలమునాఁటికిఁ దెనుఁగుకాకున్నను ఇపుడు వ్యాపకములో నాగ్రంథ ముండుటం బట్టి దానిలోని ప్రబంధ నిబంధనమునే యీక్రింద వివరించెదను. ఎట్లన్నను :-

"గీ. ఇంకఁ గావ్యప్రభేదంబు లేర్పఱింతు, వరుస నష్టాదశ విశిష్టవర్ణములు
     గలుగవలయు మహాకావ్యతిలకమునకు, నెలమిఁ దన్నామధేయంబు లెట్టి వనిన.

క. పుర, సింధు, నగ, ర్త్విన, శశి. సరసీ, వన, మధు, రతిప్రసంగ, విరహముల్
    పరిణయ, తనయోదయ, నయ. విరచన, యా, త్రాజి, దౌత్య,విభువర్ణనముల్.