పుట:Kavijeevithamulu.pdf/467

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సంకుసాల నృసింహకవి.

461

వలన నావఱకుఁ జేయంబడినగ్రంథనామములం దుదాహరింపఁబడియుండలేదు. కావున గ్రంథాంతరముల వలననైనం దానిం దెలయుట కాధారములు లేవు. గ్రంథముఖంబున నీకవి యొకపద్యముం జెప్పెంగాని దానివలన నీతని వంశానువర్ణనము తెలియదు. ఆపద్య మెట్లన్నను :-

క. గురువరభట్టపరాశర, చరణసరోరుహసముల్లసన్మానసుఁడన్
    నరసింహనామధేయుఁడ, పరిమితసత్కృతిరసానుభవహేతువునన్.

ఆశ్వాసాంతగద్యములోఁగూడ నరసింహకవియొక్కచారిత్రము కొంచెమైనను లేదు. గద్య మె ట్లున్న దనఁగా :-

"శ్రీమద్భట్ట పకాశర దేశికేంద్ర చరణనరసిజసేవకోప సేవక నరసింహ నామధేయ ప్రణీతను."

అని యున్నది. ఇట్లాశ్వాసారంభములోఁగానీ యాశ్వాసాంత గద్యములోఁగానీ స్వప్రజ్ఞాప్రకటనముగానీ వంశవర్ణనముగానీ చేసికొనినవాఁ డీనరసింహకవియొక్కఁడే యీప్రబంధకవులలోఁ గాన్పించుచున్నాఁడు. ప్రజ్ఞావిశేషము లేదేమో అని యూహింపఁగా నితనితో సమానుఁ డగుప్రబంధకవి ఆంధ్రములో నున్నట్టుగనే కానుపించఁడు. ఇట్టికవి నేమికారణముననో ఆంధ్రకవిచరిత్రములో "ఇతఁడు స్వాతిశయభావము గలవాఁడైనట్లు కనుపట్టుచున్నాఁడ"ని వ్రాయంబడియున్నది. ఇది మిక్కిలి యాలోచన చేయకయే యియ్యంబడిన అభిప్రాయముగా నిర్ణయించి అట్లుగా నభిప్రాయ పడుటకుఁ గారణభూతము లైనపద్యములరచనకుఁ గలకారణముల నుచితస్థలంబున వివరించెదను.

కవికర్ణ రసాయనము కృష్ణరాయలకడకుం గొంపోయినకథ.

ఆంధ్రకవితాపితామహుఁ డగునల్లసానిపెద్దన మనుచరిత్రము రచియించి కృష్ణరాయలకడ విశేషగౌరవము నందినవృత్తాంతంబు విని నరసింహకవి తాను నొక ప్రబంధంబు రచియించి రాజునకుం గృతినిచ్చి గౌరవము నందంగోరెను. అట్లుగా నూహించి "కవికర్ణ రసాయనమ"ను గ్రంథమును రచియించి దానిని కృష్ణరాయలకుఁ గృతినిచ్చు తలంపున