పుట:Kavijeevithamulu.pdf/426

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

420

కవి జీవితములు.

ల. సర్వగీర్వాణపదంబులన్ = సమస్తసంస్కృతపదములను, కొనినవారిన్ = గ్రహించినట్టివారిని, బాణ, భారవి. సుబంధు. భవభూతులను. తదన్యులన్ = లాతివారిని, విందుమేకదా, వీరికన్నన్, అతండు అవారణవిద్యన్ = అడ్డు లేని కవిత్వవిద్యయందు, మతిసూక్ష్ముఁడు = సూక్ష్మబుద్ధిగలవాఁడు, అతఁడు, పురుషోత్తముఁడు = పురుషశ్రేష్ఠుఁడు, ఔకతంబునన్ = అయినందున, నినున్, నిష్ప్రాణున్, చేయున్.

రా. తదనంతరంబ, నిజవిజయంబుఁ గోరుచుఁ బయలు వెడలినట్టి, ఆలంకాపతి = రావణుఁడు, పటుతరగోశక్తి = సమర్థమగుబాణ సామర్థ్యముచేత, హరిబలంబున = వానరసేనయందు, ధృడతగల = ధృడత్వము గలిగినట్టి, అంగదాదుల = అంగదుఁడు మొదలగువారిని, లీల నాక్రమించి = యుద్ధవిలాసముచేత నాక్రమించినవాఁడై, సుదర్శనహస్తనాభివత్స జఘనధృడత్వంబడంచుచు = రథాంగపాణియొక్క నాభికమలమునకు శిశు వగుబ్రహ్మవలనఁ బుట్టినట్టి జాంబవంతునియొక్క యధికమగుధృఢత్వము నడంచివై చుచు, పృథుజంఘాతిశయబలంబు ద్రుంచుచు = పృథుండు, జంఘుండునువానరులయొక్క యధికశక్తి నపహరించుచు, సుబాహు గంధవహాత్మ జానుతాపం బొనరింపుచు = సుబాహునకు హనుమంతునకుం దాపంబు సేయుచు, నీలతారకోపస్థితి విఫలంబు జేయుచు = నీలునియొక్క తారునియొక్క గోపస్థితిని వ్యర్థమును జేయుచును, సుముఖ సుగ్రీవాదులకు వివర్ణతం బుట్టించుచు = సుముఖుఁడు = సుగ్రీవుఁడు మోదలగు వానరులకుం గాంతిహైన్యముం గలుగఁజేయుచు, చేరి = సమీపమునకు వచ్చి, అన్నరసమాజనిన్ = రాముని, ఒక్కింత వివశతనొందింపన్ = ఇంచుకంత మూర్ఛనందింపఁగా, ఆలక్ష్మణాగ్రజుండు = ఆరాముఁడు అంత, ముఖ్యశత్రు పదార్థంబుగాన్ = రావణవధ నిమిత్తముగా, అనుపమానాగస్తిమితవచనాంగీ కృతహరిమంత్రుండై = అసమానుఁడగునగస్తమునియొక్క మితవాక్యములచే నంగీకరింపఁబడిన సూర్యమంత్రము గలవాఁడై, "అగస్త్యో౽గస్తిః." ద్విరూపకోశము. కమలాప్తుం డగుభగవంతున్ = పద్మమిత్రుఁడగు భగవంతుని, వేదవి