పుట:Kavijeevithamulu.pdf/425

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పిండిప్రోలు లక్ష్మణకవి.

419

ణుఁడు = నేర్పరి, వాగనుశాసనుఁడు = నన్నయభట్టును, తిమ్మఁడు = ముక్కు తిమ్మనయొకఁడు, ధూర్జటి = ఈపేరుగల కవియును, రామలింగ సంజ్ఞాప్రధితుఁడు = తెనాలిరామలింగకవియు, భాస్కర = హుళిక్కిభాస్కరుఁడును. పోతనలు = బమ్మెర పోతరాజు, ఇక్కడ. నకారమున కుత్వము రావలయు నని కొందఱనిరి. పోతనశబ్దముదేశ్యము. ఇది స్త్రీసమముగాన "పరవల్లింగం ద్వంద్వతత్పురుషయోః." అను న్యాయముచేత స్త్రీలింగసమమైనపోతనశబ్దమునకు "మహతో౽త ఉద్విభక్తౌ" అని ఉత్వము రాకపోయెను. వీరు, ఆది = మొదలుగాగల, కవనచారులు = కవిత్వమందు వర్తించువారు, అనుపమాన = సాటిలేని, కృతి = గ్రంథముగల, రామభద్రుఁడు = అనునతఁడును, శ్రీనాథుఁడు = అను కవియు, గణింపన్, బుధవరుల్ పండితశ్రేష్ఠులు, తదధికులు, తత్సములు, ధరిణిన్, లేరు, కళలన్ = విద్యలచేత, సోముఁడు = సోమకవి, పెద్దన్నకరణిన్ = అలసాని పెద్దనవలె, వెలయుచుండున్ = ప్రకాశించుచుండును, రెండవవీరుండు = పిల్లలమఱ్ఱి చిన వీరన్న, అనూనమతి = గొప్పబుద్ధి గలవాఁడు, నిరూపణము సేయన్, లక్ష్మణాఖ్యుఁడు = ఈలక్ష్మణకవి, కుండలీంద్రుండు సుమ్ము = తిక్కనసోమయాజిసుమా, తత్సదృశుఁడనుట. యజ్ఞము చేసి కుండ లేష్టి చేసినవారు కుండలములను ధరించుదురు. అందఱికన్నను గొప్పవాఁ డనుట. కానన్, చలంబు = మత్సరము, వలదు = వద్దు.

రా. భారవిన్ = కాంతిచేత సూర్యసమానుఁడయినట్టియు, ఘన = గొప్పవారగు, సుబంధున్ = మంచిబంధువులుగలిగి నట్టియు, ఆభవభూతిన్ = ఆశివునివల్లనైన సంపదగలిగినట్టియు, బాణునిన్ = బాణాసురుని, సర్వగీర్వాణపదంబులన్ = సమస్త దేవతాస్థలములను, కొనినవారిన్ = పుచ్చుకొనినవారిన్ = పుచ్చుకొనినవారిని, తదన్యులన్ = హిరణ్యాక్షుఁడు మొదలగువారిని, ఆయనతోడ కలహించి యోడినవారిననుట, విందుమేకదా. అన్నా, రణవిద్యన్ = యుద్ధవిద్యయందు, వారికన్నన్ మతిసూక్ష్ముఁడవా = సూక్ష్మబుద్ధి గలవాఁడవా, అతఁడు, పురుషోత్తముఁడు = విష్ణుమూర్తి, అవుకతంబునన్; నినున్, నిష్ప్రాణున్, చేయున్,