పుట:Kavijeevithamulu.pdf/424

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

418

కవి జీవితములు.

రవౌ మేషే" కుల = వంశమునందు, వరుతోన్ = శ్రేష్ఠుఁడగురామునితో, రివుత = వలదు.

ల. జ్యేష్ఠుఁడా = అన్నయ్యా, లక్ష్మణాగ్రజ = లక్ష్మణకవియొక్క, క్షేత్రము = మాన్యమును, ఈవు = నీవు, వదలకుండుటన్, దీనిచేత, మోసంబు = హాని, వచ్చున్, ఇఁకన్, చండ = కోపముగల, నిర్భీ = భయములేనట్టియు, కవనచారి = కవిత్వముచేత తిరుగునట్టి, పిండిప్రోలి = ఈపద మింటి పేరుగల, కవికులవరుతోన్ = కవిసమూహ శ్రేష్ఠునితో, రివుత = వైరము ముఖ్యముగన్, వలదు.

రా. భూతలంబునందున్, ఎలుంగులరా = ఎలుఁగుబంట్లకురాజు, జాంబవత్ = జాంబవంతుఁడను, సమాఖ్య = పేరుచేత, వఱలెడు = ప్రకాశించునట్టి, నిపుణుండు = నేర్పరి, వాగనుశాసనుండు = బ్రహ్మవంటివాఁడు, బ్రహ్మవలనఁ బుట్టినవాఁడు, తిమ్మఁడు = ఒకఁడు = ఒకవానరుఁడు హనుమంతుఁడు, ధూర్జటి = శివసమానుఁడు, శివాంశవలనఁ బుట్టినవాఁడు, కాఁబట్టి, రామలింగసంజ్ఞాప్రథితుఁడు = రామునియొక్క ఉంగరమనెడు చిహ్నకలవాఁడు గనుక ఈసంజ్ఞ చేత ప్రథితుఁడు, భాస్కరపోత = సూర్యపుత్రుఁడగు, సుగ్రీవుఁడును, నల = నలుండును, ఆదిక = మొదలుగాఁగల. వనచారులు, బుధవరుల్ = దేవతాశ్రేష్ఠులు, తదంశజులనుట, మఱియున్, అనుపమాన = సాటిలేని, కృతి = కుశలుఁడు, రామభద్రుండు = శ్రీరాముండు. శ్రీనాథుఁడు = విష్ణ్వంశవలనఁ బుట్టినవాఁడు = , కళలన్ = కళలచేత, సోముండు = చంద్రసమానుఁడు, పెద్దనకరణిన్ = రామునివలె, వెలయు, రెండవవీరుండు, లక్ష్మణాఖ్యుఁడు = ఈపేరుగలవాఁడు, అనూనమతి = అధిక బుద్ధిశాలి, నిరూపణము సేయన్, కుండిలీంద్రుఁడుసుమ్ము = శేషుఁడుసుమా, "ని. కుండలీ గూఢపాచ్చక్షుశ్శ్రవాః కాకోదరః ఫణీ." కాన చలంబు వలదు.

ల. లలిన్ = క్రమముగా, భూతలంబునన్, రాజాంబవత్స = లక్ష్మణకవి, తెలుఁగులన్ = తెలుఁగుఁబలుకుబడులయందు, మాఖ్య = మల్లెపువ్వువలె, శుభ్రమయిన, ప్రసిద్ధిన్ = కీర్తిచేత, వఱలెడు = ప్రకాశించునట్టి, నివు