పుట:Kavijeevithamulu.pdf/427

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పిండిప్రోలు లక్ష్మణకవి.

421

ధ్యుక్తంబుగా, నిశ్చలభావంబున ధ్యానంబు జేసి = శ్రుతి విధ్యుక్త మగు నటుల నిశ్చలత్వముచే ధ్యానించి, తత్ప్రసాద శుచిగోశక్తిన్ వృద్ధిబొందుచున్న రామునియొక్క దివ్యమగునట్టి యగ్నిరూపబాణ సామర్థ్యముచేత, అడఁ గెను. 'శుచిరప్సిత్తమ్.' అమరము.

ల. తదనంతరంబ నిజవిజయంబుఁ గోరుచుం బయలుదేఱినట్టి యాలంకాపతి = ఆలక్ష్మణకవియొక్క, పటుగోశక్తి = తక్కువగానట్టి వాక్య సామర్థ్యము, హరిబలంబున = విష్ణుబలముచేత, ధృఢత కలయన్ = ధృఢత్వము వ్యాపింపఁగా, గదాదులలీలన్ = రోగములు మొదలగువాటివలెను, 'రోగవ్యాధి గ దామయాః.' అమరము. ఆక్రమించి = అఱిమినదై, సుదర్శన = సుదర్శనముయొక్క, హస్త = కరములయొక్క, నాభి = పొక్కిలియొక్క, వత్స = వత్సముయొక్క, జఘన = కటివురోభాగముయొక్క దృఢత్వం బడంచుచున్, పృథు = విశాలమగు, జంఘా = పిక్కలయొక్క అతిశయబలంబుద్రుంచుచు, సుబాహు = శుభమగుభుజములకును, గంధవాహ = నాసికకును, ఆత్మ = మనస్సునకును, జాను = మోఁకాళ్లకును, అనుతాపం బొనరింపుచును. "క్లీ బే ఘ్రాణం గంథవహా ఘోణా నాసా చనాసికా" అమరము. నీలతారకోపస్థితి = నల్లనైనకనుగుడ్లయొక్కయునికిని, "తారాకాక్ష్ణః కనినికా." అమరము. విఫలంబుఁ జేయుచు, సుముఖసుగ్రీవాదులకు = సుందర మగుముఖము శుభ మగుకంఠము మొదలగువాటికి, వివర్ణతం బుట్టింపుచు. చేరి, అన్నరసమాజవర్యు = ఆనరసమ్మ కుమారులలో శ్రేష్ఠుం డగుదమ్మనను, ఒక్కింత వివశతనొందింపన్. ఆలక్ష్మణాగ్రజుండు = ఆలక్ష్మణకవి, అంతట, ముఖ్యశత్రుపధార్థంబుగాన్ = దమ్మన్నయొక్క వధనిమిత్తముగా, అనుపమానాగస్తి మితవచనాంగీకృత హరిమంత్రుండై, ఉపమలేనట్టియు, నిర్దోషములగునట్టియు, నిశ్చలములగునట్టియు వాక్యములచే నంగీకరింపఁబడిన విష్ణుమంత్రము కలవాఁడై కమలాప్తుండగు భగవంతున్ = లక్ష్మికి నాప్తుఁడగు భగవంతుని వేదవిధ్యుక్తముగా నిశ్చలభావంబున ధ్యానంబుజేసి, తత్ప్రసాదలబ్ధ దివ్యతేజో