పుట:Kavijeevithamulu.pdf/347

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పింగళిసూరన.

341

చా. దీనిచేతనే రామభూషణకవికంటె సూరన వర్ణనావిషయములోఁ గించిత్తు తగ్గనాఁ డని చెప్పవలసియున్నది. రామభూషణునివలె వర్ణనలు సర్వతోముఖముగఁ జేయఁగలవా రాంధ్రకవులలో లేరు సరిగదా సంస్కృతములో లక్ష్మీసహస్రము రచియించినకవిగూడ నాతనిఁ బోలఁజాలఁ డని చెప్పవలసియున్నది.

7 ఉ. ఏ హేతువుననో నూతన తనమూఁడవకావ్య మగుకళాపూర్ణోదయమున నీఛాందసవృత్తికి లోనైనాఁడు. తనకాలమందలి కవులయం దీవర్ణనలు చేయుట యాచారమై యుండుటంబట్టి తనకావ్యములం దేదేని యొక్కదానియందు వానిఁ జేర్చిన నెట్టు లుండునో చూత మనుతాత్పర్యమున వ్రాసినను వ్రాసియుండునుగాని యావర్ణనలందు సూరన కేమాత్రమును గౌరవము లేదు.

చా. సూరన వర్ణనావిషయ మగుఛాందసవృత్తి నవలంబించుటకుఁ గారణము విస్పష్టమే. తన ప్రథమకృతి పురాణ మవుటంజేసియుఁ రెండవకృతి ద్వ్యర్థికావ్య మగుటం జేసియుఁ దనవర్ణనాసామర్థ్యముఁ జూపుట కనువుపడలేదు. ప్రబంధకవిత్వమునకు వర్ణనాపాండిత్యమే ప్రధానము. అవి కల్గియుండనినాఁడు ఏకృతియుఁ బ్రబంధము కాదు. ఆకవి ప్రబంధకవి కాఁడు. ప్రబంధకవి యనిపించుకొనిన నాతనికాలములో గౌరవమున్నదిగాని పురాణముం దెనిఁగించినను, ద్వ్యర్థి కావ్యము రచించినను గౌరవము లేదు. కావున సూరన కళాపూర్ణోదయము నందైనఁ దాను ప్రబంధకవి ననిపించుకొనవలయు నని యత్నించి ప్రబంధవర్ణనల నన్నిటిం జేసియున్నాఁడు. అది యిప్పటివారిసాహిత్యభేదముం బట్టి ఛాందసముగాఁ గానుపించినను సూరకవికాలమువారి కాప్రజ్ఞ విశేషముగా నుండెను. అట్టిగౌరవకార్యముగనుకనే దానిని మనఃపూర్వకముగ నారంభించెను.

8 ఉ. ప్రభావతీప్రద్యుమ్నమునందుఁ బురవర్ణన మైనఁ జేయకమునుపే మొదటి పద్యమునందే కథాప్రారంభము చేసి భూమికి దిగివచ్చుచుండఁ గ్రిందఁ గనుపించు చున్న ద్వారకాపట్టణవైచిత్ర్యములను ఇంద్రమాతలులు జెప్పుకొనునట్లు వ్రాసినాఁడు.

చా. ప్రబంధములోఁ గొన్నివర్ణన లుండవలయు నని యున్నది గాని అందు ప్రథమములో నీవర్ణన లుండవలె నని లేదు. ఆకారణము