పుట:Kavijeevithamulu.pdf/341

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
335
పింగళిసూరన.

శేషము లుండి యవి యాయాకవులబుద్ధివిశేషమును, గల్పనాశక్తిని బ్రకటించుచునే యున్నవి కాని యుపన్యాసకుఁ డనినట్లు హాస్యాస్పదములుగా లేవు. కవిత్వవ్యవసాయము చేసినవార లిచ్చెడియభిప్రాయ మిది గా దనియుం గూడ చెప్పవలసియున్నది.

6 ఉ. ఈప్రబంధకవులకు మార్గదర్శి యగుపెద్దనమాత్రము కొంతపొగడ్తకుఁ దగియున్నాఁడు. కాని తక్కినవారందఱు నాయనవర్ణనలకు నచ్చటచ్చట మెఱుఁగువెట్టియేని పూర్వకవివర్ణనాంశములఁ గలిపియేని వ్రాసినారుకాని తమస్వశక్తిని జూపియుండలేదు. పెద్దనకూడ తనవర్ణ నల నితరులనుండి చేకొనియున్నాఁడు.

చా. ఉపన్యాసకుని దృష్టిలోఁ పెద్దనకవియే గ్రంథచోరుడుగాఁ గాన్పించఁగా నిఁక తక్కినకవులంగూర్చి చెప్పనేల? ప్రబంధములవిషయములో నిట్టిన్యూనాభిప్రాయ మీవఱకే విమర్శకులు నీయలేదు. ఇందు విమర్శకునకుఁ బ్రబంధపరిపాటి తెలియ దని చెప్పుటయే యుత్తరువు. దీనికి వివరణము చేయుటకై యత్నించుట నిష్ఫల మగును.

7. ఉ. ప్రబంధములలో నెద్దానిం జేకొన్నను దానికథ చదువకయ చెప్పవచ్చును.

చా. ఇది యొక గొప్పశక్తి. మనుచరిత్రమునకు గలకథ గ్రంథము పేరు వినినంతమాత్రముననే బోధించు నేమో? చదువఁగాఁగాని నా కాకథ తెలియలే దని చెప్పుట ఆత్మానుభవము. అటులనే పారిజాతాపహరణము యొక్కయు, నాముక్త మాల్యదయొక్కయు, పాండురంగక్షేత్ర మహాత్మ్యముయొక్కయు, యయాతిచరిత్రయొక్కయు మఱియు నిట్టిప్రబంధములయొక్క కథలు పేరు వినినంతమాత్రమున నవగాహనకు రాకున్నవి. అటుగాకున్న నుపన్యాసకుని వాక్యమునకు వేఱేది యైన నర్థ మున్న నుండవచ్చును.

8 ఉ. రామరాజభూషణకవిరచిత మగువసుచరిత్రఁ జేకొనుఁడు. అందలి కథ నెల్ల నొక్కవాక్యమునఁ బొందుపఱుపవచ్చును. వర్ణనలుమాత్ర మతిమాత్రములై యున్నవి. చంద్రోదయవర్ణనమున ముప్పదిపద్యములును సూర్యోదయవర్ణనమున నలువదిపద్యములును, నాయికా నాయకుల విరహదశావర్ణనమున రెండాశ్వాసములును వ్రాసి కాలము గడపినాఁడేకాని కథాంశముల వర్ణించి రసము పుట్టించినవాఁడు కాఁడు.