పుట:Kavijeevithamulu.pdf/342

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
336
కవి జీవితములు

చా. వసుచరిత్రముపై యాక్షేపణచేసినపరిశీలకు లెవ్వరు నీవఱకుం గాన్పించలేదు. ఉపన్యాసకున కేకారణముననో సాహిత్యరసపోషణుఁ డగురామరాజభూషణునికవితారసము వెగటై పోయినది. తా మెచ్చెడుసూరనకవి కన్ని విధముల నితఁ డధికుఁ డగుటకు నలిగినాఁడేమో! లేకున్న కారణాంతర మేమైన నున్నదో! వసుచరిత్రములో రాజరాజభూషణుఁడు కురిపించినసాహిత్యరసవర్షము అతనికిఁ బూర్వమున నున్న కవులకు లభింపకపోవుట మంచిపని యాయె నని తదనంతరకవులు దాని నంతయుఁ దమకవితాసన్యములకే వినియోగింపఁ జేసికొని బలవంతము లై ఫలవంతము లగుకవితానన్యగర్భు లగుచున్నారు. వసుచరిత్ర కవిం గూర్చి వ్రాయుచో నాగ్రంథవిశేషముల వక్కాణించెదను. ముం దుపన్యాసకాధిక్షేపణములకుఁ గొంచెము సమాధానము వ్రాసెదను. అందలి కథనెల్ల నొక్కవాక్యమునఁ బొందుపఱుపవచ్చు నను దానికి బుద్ధిమంతులైనవారు రామాయణకథనుగూడ నట్లే చేయవచ్చును. భారతకథ నట్లే చేయవచ్చును. సర్వకథల నట్లే చెప్పవచ్చును. ప్రబంధములు కథాచమత్కారముల కొఱకుగా నేర్పడినవి కావు. ఇవి ప్రత్యేకము వర్ణనప్రజ్ఞను చూపుటకే ఏర్పడినవి. రామభూషణుఁ డదివఱకు పెద్దన చెప్పినమనుచరిత్రములోని కథాచమత్కృతి తెలియని వాఁ డై యీవసుచరిత్రము నారంభించి యుండఁడు. అందుఁ గథాప్రయుక్తచమత్కృతియేగాని కవిత్వ రసప్రయుక్తచమత్కారము విశేషముగ లేకుండుట నూహించి కథాచమత్కారము లేనిగాథనే యేర్చి కొనియుండును. అటులే కాకున్న చమత్కారకథలు తెల్పుగాథలు మనపురాణములలో లేవా ? అట్టివానిని రామరాజభూషణుఁడు చదివియుండకుండునా ? కావున నిట్టియుద్యమము శ్లాఘాపాత్రమే. వర్ణనలుమాత్ర మతిమాత్రములై యున్న వనుదానికిఁ జెప్పవలసినమాట యొకటి యున్నది. కల్పన లత్యద్భుతము లనియో లేక అతివిస్తారము లనియో ఇందు కల్పన లత్యద్భుతము లగు ననుట ఆంథ్రసంస్కృత కవి