పుట:Kavijeevithamulu.pdf/337

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పింగళిసూరన.

331

ర్వకవికృతవర్ణనలవెంబడి పోయిరే గాని కేవలము స్వకపోలకల్పితములకై పోవువారు కారు. ఇతఁడు నట్టివాఁడే యని కంఠోక్తిగాఁ జెప్పవలసియున్నది కాని యిం దీతనివిశేష మేమియుఁ గాన్పించదు. ఆంధ్రగీర్వాణభాషలయందలి యాదిమకవులం బేర్కొనుట యితరుల నిరసించుటకుఁ గాదు. అట్లే అయిన కాళిదాసాది మహాకవులం దిరస్కరించి నట్లగును. సంస్కృతములోఁ గవిత్వము చెప్పినవారు ప్రాచీను లగు ఋషు లై యున్నారు. కావున వ్యాసవాల్మీకులు సర్వజనులవలనఁ బరిగణింపఁ బడుచున్నారు. సూరన వారిగ్రంధముల రెండిటిం జోడింపఁ గమకించినాఁడు గనుక

"వాల్మీకి వ్యాసులఁ గొల్చెదన్ తదుభయశ్లేషార్థసంసిద్ధికిన్.

అని చెప్పినాఁడు. ఆంధ్రములోఁగూడ భారతకవిత్రయము వారు ఆంధ్రభాషా మహోపకారులలోఁ బ్రధానులు కావున వారు మాత్ర మనేకులవలనఁ గొనియాడఁబడుచున్నారు. అంతమాత్రమున వారికి గౌరవమును తక్కినవారి కగౌరవమును జేయుతలంపు సూరనకుఁగాని యే యితరకవులకుఁగాని యుండ దని నిశ్చయించవలసియున్నది. అ ట్లుండిన నాతఁడు శ్లాఘాపాత్రుఁడు కాకయే పోవచ్చును.

12. ఉ. కల్పనాశక్తి యీతనికి మెండుగ నుండుటచేతనే యాశక్తిచే నలంకరింపఁ బడినకవులను మాత్రము వర్ణించినాఁడు.

చా. పైనిఁ జెప్పంబడినయాంధ్రగీర్వాణకవులు పురాణకవులు. వారికిఁ గల్పనాశక్తితోఁ బ్రసక్తి లేదు. వారు చెప్పినదంతయుఁ జారిత్రములుగాని కావ్యములు కావు. ఒకవేళ నుపన్యాసకునియభిప్రాయములోఁ బురాణము లన్నియుఁ గల్పితము లని యున్న దేమో. అట్లుండిన వ్యాసవాల్మీకులు గాని వారికథలను కలిపిచెప్పినసూరన గాని శ్లాఘాపాత్రులు కాకపోవలెను. వీరలలో నెవ్వరును క్రొత్తకథలఁ గల్పించలేదు గదా.

13. ఉ. ఈతఁడు, వ్రాసినగ్రంథములెల్ల నూతనఫక్కికములై యున్నవి. మొదల నితనికి సహజ మగుశక్తి కలదఁట. పిదప కాళిదాసాదిమహాకవుల కావ్య