పుట:Kavijeevithamulu.pdf/336

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

330

కవి జీవితములు

లం గూర్చి కాదు. ప్రబంధకవులను ప్రబంధకవులతో సరిచూడవలెను. అం దీతనికంటెఁ బెద్దనాదు లన్ని విధముల నధికు లనుటకు సందియమే లేదు.

9. ఉ. తిక్కనతర్వాత నాచనసోమునిం జెప్పవచ్చును. ఈయిరువురితరువాతను సూరన గణనకు రాఁదగియున్నాఁ డని తలంచెదను.

చా. పైన వ్రాసినదే దీనికిఁగూడ సమాధానము. కావున దీనికి వేఱుగ నుత్తరమీయను.

10. ఉ. ఇతఁడు ఒకరు త్రొక్కినమార్గములం ద్రొక్కువాఁడు కాఁడు. తాను సంపాదించినలోకానుభవము, స్వీయ మగుతనబుద్ధివైశద్యము, ప్రతిభాసమా సాదిత మగుగుణాగుణ వివేచ నాశక్తియుఁ గలుగఁజేసినయభిరుచులమూలముగఁ గావ్యములు వ్రాసినవాఁడుగాని కబ్బపుదొంతుల సత్పదార్థములు వెదికి వ్రాసినవాఁడు కాఁడు.

చా. ఈసిద్ధాంతము కాళిదాసుమార్గమునే యితఁ డవలంబించినాఁ డనియును, రాఘవపాండవీయములోని "శ్రమ ముడుగుండు" అను పద్యము కాళిదాసకృత "పరిచయం చలలక్ష్యనిపాతనే" అను శ్లోకమునకు సరియైన తెలుఁగుగాఁ గాన్పించుచుండు నని యుపన్యాసకుఁడు 10 పుటలో వ్రాసిన మాటలకును బాధక మగుచున్నది. "బాణోచ్ఛిష్టం జగ త్సర్వ" మ్మని యున్నబుధజనోక్తియు దీనిని బలపఱుచుచున్నది. సూరకవియొక్కఁడే గ్రంథచోరుఁడు కాఁడని చెప్పఁగాఁ దక్కినకావ్యకవులందఱును గ్రంథచోరు లని అర్థాత్తు సిద్ధించుచున్నది. అట్లైర పెద్దనాదుల పెద్దఱికము చెడిపోవును. సూరనకు పైవారికంటె గౌన వాధిక్యము లేదనుమాట సర్వత్ర విదితమే. కావున సూరనంగూర్చి విశేషించి చెప్పుట యత్యుక్తి యగును.

11. ఉ. నూతనసృష్టి చేయుట యితనిమతము. చిలుకపలుకులవలె పూర్వకవి కృతవర్ణనలవెంబడి పోవుట యితనిమతము కాదు. కావుననే తన్నకావ్యములం దితఁ డాంథ్రీగీర్వాణభాషలయందాదిమకవులం బేర్కొని యున్నాఁడే కాని తక్కుంగలవారిపేళ్లనైనఁ దడవియుండలేదు.

చా. నూతనసృష్టి చేయుట యితనికే కాక కావ్యరచనచేయు వారియందఱిమతము నై యున్నది. ఇతనిపూర్వులు నీతనివలెనే పూ