పుట:Kavijeevithamulu.pdf/327

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు తెలియని సమస్య ఎదురైనది
321
పింగళిసూరన.

రము గలదు. దానికి దృష్టాంతము తిక్కనసోమయాజికృతనిర్వచనోత్తర రామాయణమును, శ్రీనాథకృతనైషధము నై యున్నది. గరుడపురాణముంగూర్చి యింతకంటె విశేషించి వ్రాయంజాలము. నాల్గవగ్రంథ మగుప్రభావతీప్రద్యుమ్నముం గూర్చి మొదటనే వ్రాసియున్నాఁడను ఇఁక రాఘవపాండ వీయముంగూర్చి యిపుడు వ్రాసెదను.

రాఘవపాండవీయము.

దీనియుత్పత్తిం గూర్చి యిదివఱకే కొంతకొంత వ్రాసియున్నాము. ఇపు డిందలి కృతిపతి వంశవృక్షమును కవికవిత్వవిశేషములు నుడువుటయు మాత్రము చెప్పవలసినదిగా నున్నది. కృతిపతి యగు ఆకు వీటి పెదవేంకటాద్రిరాజుయొక్క వంశావళి యీక్రింది విధముగా నున్నది.


గ్రంథరచనాకారణము.

ఈపైకృతిపతి యగుపెద్ద వేంకటాద్రిరా జొకనాఁడు సంగీతసాహిత్యాది వివిధవిద్యాప్రసంగంబులఁ బ్రవర్తిల్లుచు సూరనకవిం బిలుపించి సముచితసత్కారంబుల గౌరవించి రెండర్థములపద్యము చెప్పుటయే