పుట:Kavijeevithamulu.pdf/326

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

320

కవి జీవితములు

రింపఁ బ్రాలుమాలినారము. ఇపుడు మన మట్టికొఱఁత నివారించుకొనియెదముగాక.

ఈసూరనకృతగ్రంథములపేరు లీవఱకు చెప్పియున్నారము. ఇపు డాగ్రంథరచనావిషయము తత్కృతిపతు లతనివిషయ మై చేసిమమర్యాదలును వివరించవలసియున్నదిగనుక మఱియొక పరి వాని నీక్రింద వివరించెదను.

అందు

1. గారుడపురాణము (సంస్కృతమునకుఁ దెనుఁగున భాషాంతరీకరణము.)

2. రాఘవపాండవీయము (ద్వ్యర్థికావ్యము)

3. కళాపూర్ణోదయము (అభూతకల్పనాకథాప్రబంధము)

4. ప్రభావతీప్రద్యుమ్నము (స్వవంశావళియుక్తప్రబంధము)

ఈగ్రంథములలో గారుడపురాణము తప్ప తక్కిన గ్రంథములు మూఁడును ముద్రితము లై ప్రకటింపఁ బడి యున్నవి. మొదటి గ్రంథమగుగారుడపురాణము, గొప్పగ్రంథ మై యుండుటచేత బహుప్రతి ముఖంబున సర్వదేశంబులలోను వ్యాపింపక పో వచ్చును. ఆ కారణమున ప్రస్తుతకాలములో నది యచ్చొత్తువారికిని లభ్యము కాక యుండవచ్చును. మూఁడుసంవత్సరముల క్రితముదనుకఁ గళాపూర్ణోదయమును సంవత్సరముక్రిందటిదాఁక ప్రభావతీప్రద్యుమ్నమును అచ్చువడియుండక పోవుటచేత దుర్మభములుగా నుండినవి. ఇట్టిస్థితిలో వందలకొలఁది పుటలు గలపురాణములకు ప్రత్యంతరములు దొరకునా? నేఁటివఱకును చిరకాలముక్రిందటనాంధ్రీకృతము లైనపురాణము లనేకము లముద్రితములుగా నేయున్నవి. వీనిలో సూరనకృతం బగుప్రథమపురాణగ్రంథమును జేరి యుండును. ఇ ట్లూహించుట న్యాయముగాని ఆంధ్రకవిచరిత్రములో వలె సూరకవియొక్క బాల్యకవిత్వమవుటచే నాగ్రంథము నశియించి పోయి యుండెనేమో అని యూహించుట న్యాయము కాదు. ప్రాచీనుల కవిత్వములు ప్రథమములోనే విశేషప్రౌఢముగా నుండు నాచా