పుట:Kavijeevithamulu.pdf/328

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

322

కవి జీవితములు

కష్టమైయుండఁగా నట్టియర్థద్వయముతో నొప్పుకావ్యము చేయుట యెంతయుఁ గష్టమైయుండును. అట్టికావ్యము నీయట్టిపండితుఁడే రచియింపవలెనుగాని అది యన్యులకు సాధ్యము కా దనుచు నీక్రిందిపద్యములం జెప్పన ట్లున్నది.

ఉ. భీమన తొల్లి చెప్పె నను పెద్దలమాటయ కాని యందు నొం
    డేమియు నేయెడ న్నిలుచు టెవ్వరు గాన రటుండనిమ్ము నా
    నామహితప్రబంధరచనాఘనవిశ్రుతి నీకుఁ గల్గుటన్
    నామదిఁ దద్ద్వయార్థకృతి నైపుణియుం గల దంచు నెంచెదన్.

క. చాటుప్రబంధరచనా, పాటవకలితుఁడవు శబ్దపరిచితియందున్
    మేటివి దీనిం దెనుఁగునఁ, బాటించి రచింప నీవ ప్రౌఢుఁడ వరయన్.

ఉ. దక్షత యింత కల్మి విశదంబుగఁ గాంచియు నీమది న్ఫలా
    పేక్ష ఘనంబు గామి నిది యిట్టనఁ గొంకెద నీకు నోలలా
    టేక్షణభక్తిశీల రచియించుట యిష్టముగాదె శ్రీవిరూ
    పాక్షున కంకితంబుగ శుభార్థము రాఘవపాండవీయమున్.

ఇట్లుపెదవేంకటాద్రివలననే సూరన కవిత్వవిశేషములు కొన్ని వక్కాణింపఁబడినవి. అట్టిశ్లాఘాపూర్వకము లగుప్రభుని యుత్సాహవాక్యముల కలరి, తాఁ జేయందొరకొనిరాఘవపాండవీయములోఁ దాను చూపింపవలసినశయ్యా విశేషముల నీక్రిందివిధంబున వివరించెను.

సీ. ఆంధ్రభాషాసంస్కృతాభిభాషాశ్లేష, యొక్కొకచోట నొక్కొక్కచోట
    నుచితశబ్దశ్లేష యొక్కొక్కచోట న,ర్థశ్లేష యొక్కొక్కతఱిని ముఖ్య
    గౌణవృత్తిశ్లేషఘటన యొక్కొక్కతఱి, నర్థాన్వయము వేఱె యగుచు నునికి
    శబ్దాన్వయవిభేదసంగతి యొక్కొక, తఱి నవి యొక్కొక్కతఱిని రెండు

తే. మూఁడు కూడుట యన సముజ్జ్వలము గాఁగ
    నాకుఁ దోఁచినగతిఁ బెక్కుపోక లమర
    రామభారతకథలు పర్యాయదృష్టిఁ
    జూచుసుమతుల కేర్పడ నాచరింతు.

పైపద్యములోని విశేషములు స్పష్టపఱుచుచో గ్రంథబాహుళ్య మగు నని యెంచియు నవి యలంకారగ్రంథములలోఁ దెలియందగి