పుట:Kavijeevithamulu.pdf/273

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీనాథుఁడు.

267



కు సమర్థుఁడు గాక యావృత్తాంతముం దెల్పిన శ్రీనాథకవి శపియించునేమోయనుభీతిచేత మిగులఁ జింతించి తనభార్యకు వేశ్యా వేషం బమర్చి శ్రీనాథునిపడకటింటిలో నిల్పె ననియును. అంతట శ్రీనాథుం డాపతివ్రతతోముచ్చటించి యాపె వెలవెలఁదుక గా దని నిశ్చయించి యా పెవృత్తాంతమును సమూలముగా గ్రహియించి సింగనమంత్రియొక్క సాహసౌదార్యముల కెంతయు సంతసించి తాను రచియించి యుంచినశృంగారనైషధ మాతనికిం గృతి యిచ్చి వేమారెడ్డిసభకుం బోయి జరిగినవృత్తాంత మంతయు నతనికిం దెల్పెనఁట ! అపు డారెడ్డి తన కాగ్రంథము కృతి యందునదృష్టము లేనందుకు మిగులఁ జింతించి యెట్లైన నే నిచ్చెద నని వాగ్దానము జేసిన నర్ధరాజ్యంబు నిచ్చి వేసెద నని పలుకఁగా శ్రీనాథుఁడు తనకుఁగా నీయనుంచిన రాజ్యార్ధము సింగమంత్రికి నిమ్మని పల్కెనఁట ! అపుడు వేమారెడ్డి కొంతవఱ కాలోచించి యర్థ రాజ్యంబు కవికిని సర్వరాజ్యమంత్రిత్వంబు సింగమంత్రికి నొసంగ నపుడు శ్రీనాథుండు మరలఁ దనయర్థ రాజ్యంబు రాజున కొసంగి మంత్రి నీక్రిందివిధంబుగా నుతియించెనఁట. ఎట్లన్నను :-

"క. శ్రీరాజరాజవేమ, క్ష్మారమణ కృపాకటాక్ష సంవర్ధిత ల
     క్ష్మీరక్షితబుధలోకో, దారగుణాధార సింగనామాత్యమణీ."

సింగనమంత్రివంశముంగూర్చి.

అని యిట్లు ద్వాత్రింశన్మంత్రి చరిత్రములో నున్నది :-

అట్టికథ యథార్థ మగునా యనుదానిఁ బరిశీలుంచుటకుఁ బూర్వము సింగమంత్రివంశస్థు లావఱకే మంత్రిత్వముం జేసియుండిరేని శ్రీనాథునిమూలముగ సింగన మంత్రి యయ్యె నని చెప్పెడుబలవత్తరమైనపూర్వపక్షము నిలిచిపోవును. ఆవిషయము శృంగారనైషధములో శ్రీనాథకవిచే వర్ణింపఁబడినసింగనవంశావళి నీక్రింద సంగ్రహించి వివరించెదను.