పుట:Kavijeevithamulu.pdf/274

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

268

కవి జీవితములు

కృతిపతి యగుసింగనమంత్రిపేరిటఁ జెప్పంబడినయీక్రిందిపద్యములలోనిబిరుదంబులంబట్టి చూడ నీసింగమంత్రి శృంగారనైషధముం గృతి నందునాఁటికే వేమభూమీశునియాస్థానమున రాజ్యనిర్వాహక తంత్రమున విశేషవిఖ్యాతిం గాంచి తనపూర్వు లగుమంత్రులకంటె నెక్కుడుబిరుదులు సంపాదించినట్లు కాన్పించును అది యెట్లనఁగా :-

సీ. గగనకల్లోలినీ కల్లోలమాలికా, హల్లీసకములతో నవఘళించి
    చరమసంధ్యాకాలసంపుల్లమల్లికా, స్తబక పంక్తులతోడ సరసమాడి
    శర దాగమారంభసంపూర్ణపూర్ణిమా, విమలచంద్రికలతో వియ్యమంది
    బిసరుహాసనవధూపృథుపయోధరభార, హారవల్లరులతో ననఁగి పెనఁగి

గీ. వెలయు నెవ్వానియభిరామవిమలకీర్తి, యతఁడు త్రిభువన రాయ వేశ్యాభుజంగ
    కదన గాండీవి, జగనొబ్బగండబిరుదు, శాశ్వతుం డొప్పు సింగనసచివవరుఁడు.