పుట:Kavijeevithamulu.pdf/239

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
233
తెనాలి రామకృష్ణకవి.ఈకూర్చుండుట యక్కడనే చేసితిరేని యెండవానలవలన శ్రమ తప్పును. నాగృహమును బావన మగును. కాఁబట్టి నన్నుఁ గటాక్షించి యరుఁగుపై దయసేయుం" డని ప్రార్థించెను. అట్టిప్రార్థన వినియును వినన ట్లూరకుండి రామకృష్ణుఁడు రాత్రివేళ జనులందఱును నిండ్లకుఁ బోయినతఱి నావేశ్యయరుఁగుపైకి వచ్చి, ప్రవేశించెను. మఱునాఁ డతఁడు తనయరుఁగుపైకి వచ్చి యుండుటఁ జూచి "గాలి విశేషముగ వీఁచుచున్నది గావున స్వాములు లోపలిసావిడిలోనికి వచ్చి కూర్చుండిన వెచ్చగ నుండును. తాను సర్వకాలములలోఁ బరిచర్య చేయుట కనువై యుండును. కావున నట్లుగా ననుగ్రహింపుఁ"డని మఱియొకసారి ప్రార్థించెను. దానికి నుత్తర మేమియుం "జెప్పక యారాత్రి తొల్లింటి యట్లనే యంతఃప్రవేశము చేసెను. కాని యారెండుదినంబులును బైరాగి మాటలాడుట మాని మౌనవ్రతస్థునివలెనే చేతిసంజ్ఞలనే కాలము గడుపుచువచ్చెను. మూఁడవనాఁ డెవ్వఱును తనచుట్టు లేని సమయమున నాలుగైదువరహాలం దీసి వేశ్యమాతచేతి కిచ్చి తనకుఁ గావలసినయొకసేరుపాలును, పంచదారయును, కర్పూరము మొదలగుపూజా ద్రవ్యంబులును తెచ్చి యిమ్మని పల్కెను. అట్లుగా నైనను తనతో మాట్లాడుట గొప్పభాగ్య మని సంతోషించి వేశ్యమాత కావలసినవస్తువులం దెప్పించి యిచ్చెను. రామకృష్ణుండు మరల రెండవనాఁడు మఱినాల్గువరాల నిచ్చి తొల్లింటిదినమువలెనే పాలును, పంచదార మొదలగువస్తువులం దెమ్మని చెప్పెను. "పాలునకును పంచదారకును నిత్యమును నాలుగేసివరహాల నిచ్చుబైరాగి యొకగొప్పమహానుభావుఁడు గాకయుండునా" అని యావేశ్యమాత యతనికడ నెద్దియో స్వర్ణయోగ ముండక తప్పదు. దాని నొకదానిని పరిగ్రహించిన నిఁక నెన్నఁటికిని ధనలోప ముండ దని నిశ్చయించుకొని తనకూఁతుం బిల్చి "మన మెటులనైన నతనియుల్లము రంజిల్లం జేసి యాదివ్యక్రియ సంపాదింపవలయు" నని చెప్పి దానిని సమ్మతింపంజేసి నాఁటినుండి స్వాములవారిపరిచర్యకు