పుట:Kavijeevithamulu.pdf/231

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
217
తెనాలి రామకృష్ణకవి.నీ కిందు సంపూర్ణ పాండిత్యము గలదు. ఇఁక దప్పులు దిద్దుటయం దెట్టిప్రజ్ఞ గలదో దానింగూడ సభ్యులు చూడఁ దలఁచి యున్నారు. ఇదె యీపద్యములోనితప్పుల దిద్దు మని యీక్రిందిపద్యము చేతి కిచ్చెను :-

మ. గననీహారగు రామపద్మ ధళరంగ త్కీర్తి చాణూరమ
     ద్ధనశుక్రాక్షికళేభరాణ్మృగపతీ త్రైలోక్య ధామోదరా
     యనగాశంఖర వాంఛితార్థదగదా ద్యస్రైక పాణీజనా
     ర్థనవా నేక ప వైరి విగ్రహముకుంధా మిత్రవింధాదిపా.

దీనిం జూచి నర్సన పైకిఁ దప్పులుగా నగపడుచుండునట్టిచాణూరమద్ధనాదిశబ్దంబులఁ గొన్నిటిఁ జాణూరమర్దన మొదలగు రూపము లుంచి దిద్ది యాతనికిం జూపె. రామలింగ మపుడు పక్కున నవ్వి సభాసదులం జూచి యిట్లనియె. అహహా! యీమహాకవిప్రజ్ఞావిశేషము లమేయములు. తనఁకుఁ దెలియని వన్నియుఁ దప్పులఁట! నాపద్యంబునఁ దప్పు లున్నవియఁట! చూడుఁడు ! అని తా నాపద్యము క్రమముగ నన్వయించి చాణూరమద్ధన మొదలగుశబ్దములకు జాణూరమత్ హన అని విరిచి యర్థము సెప్పి సభ్యుల నాయర్థమునకు మెచ్చించి నర్సనం జూచి యిట్లనియె :-

చ. తెలియని వన్ని తప్పు లని దిట్టత నాన సభాంతరంబునన్
    బలుకఁగ రాకురోరి పలుమాఱు పిశాచపుపాడగట్ట నీ
    పలికిననోట దుమ్మువడ భావ్య మెఱుంగక పెద్దలైనవా
    రల నిరసింతురా ప్రెగడరాణ్ణరసా విరసా తుసా భుసా.

అని యంతటితోఁ బోనీయక,

చ. ఒకనికవిత్వమం దెనయునొప్పులు తప్పులు నాకవిత్వమం
    దొకనికిఁ దప్పు పట్టుపని యుండదు కా దని తప్పు పట్టినన్
    మొక మటు క్రిందుగా దిగిచి మొక్కలు పోవనినుంపకత్తితో
    సిక మొదలంటఁ గోతు మఱి చెప్పునఁ గొట్టుదు మోము దన్నుదున్.

అని రామకృష్ణుఁ డుక్కుమిగిలి ధిక్కరించిన నక్కవిశిఖామణి యేమియు ననఁజాలక లజ్జితుం డై తనరాకఁ దిట్టుచుఁ జీఱుచెమ్మట