పుట:Kavijeevithamulu.pdf/212

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

198

కవి జీవితములు

"శ్రీసదాశివదేవమహారాయలు విజయనగరమందు రత్న సింహాసనస్థుఁడై రాజ్యమేలుచుండగా సూర్యవంశస్థులైన శ్రీమన్మహామండలేశ్వర, సంగరా జను నాయన తత్పూర్వమందె యీసంగమేశ్వరస్థలమునకు దక్షిణభాగమందు పరుగుదూరమున గ్రామము గట్టుకొని పదియిండ్లరాచవారిని గూర్చుకొని యాపల్లె వారిజాగీరుగా ననుభవించుచుండిరి అందుచే నది రాజుపాలెం" అని చెప్పఁబడును.

సంగరాజుకుమారులు :-

1. బొమ్మ రాజు.
2. మంగ రాజు.
3. గురవ రాజు. (శైవుఁడు) ఇతనికిఁ గొడుకులు తొమ్మండ్రు గలిగిరి. వారి, పే ళ్లెవ్వి యనఁగా :-
1. పెదసంగ రాజు.
2. చినసంగ రాజు.
3. తిమ్మ రాజు.
4. రుద్రరాజు.
5. బసవరాజు.
6. పెడచిట్టిరాజు.
7. చినచిట్టిరాజు.
8. బొజ్జసంగ రాజు.
9. పాపసంగ రాజు.

పై గురవరాజు దేవునియుత్సవములకు గడువక తనకుటుంబ సహితముగ విద్యానగరమునకుం బోయి శ్రీరంగరాజు, రామరాజుల ద్వారముగ సదాశివరాయలను దర్శించి, యాయనవలన నాల్గుగ్రామములు స్వామినిమిత్తముఁ గైకొనియెను. ఇది జరిగిన కాలము శా. సం. 1465 శోభకృత్తు సంవత్సరము (A. D. 1543)

పై కథనుబట్టి పెదసంగ రాజుకాలమును, అతనిమంత్రియుఁ గృతిపతియు నగువేదాద్రికాలమును, కవియగురామకృష్ణుని కాలమును మన మించుమించుగా నూహింపవచ్చును. పైగురవరాజును నతనితొమ్మండ్రుకొడుకులును బై శాశనములో వక్కాణింపఁబడుటచేత నప్పటి కతఁడు మిక్కిలి ముదుసలియై యుండవచ్చును. గురువరాజునకుఁ జెప్పంబడ నిరాయరాహుత్తు మొదలగుబిరుదులు పెద్దసంగమ రాజునకుఁ గల్గుటంబట్టియుఁ బూర్వసింహాసనాధీశ్వరుం డని యుండుటంబట్టియుఁ జూడఁగా నీ పెద్దసంగరాజునాఁడు విశేషవిభవంబు గల్గినట్లు గోచరంబయ్యెడిని. అట్టివిభవము గల్గుట క్రమముగా నానెగొందిప్రభువుల యనుగ్రహం