పుట:Kavijeevithamulu.pdf/213

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
199
తెనాలి రామకృష్ణకవి.బున నైనను గావచ్చును. కాదేని సదాశివరాయలకాలములో నాదేశమునఁ గల్గినయ రాజ కావస్థలో సింహాసనమును సంపాదించి యైనను నుండవచ్చును. ఇది శా. సం. 1450 ల సమీపకాలముగా నిశ్చయించుటకుఁ దగి యుండును.

పై వేదాద్రిమంత్రికాలమును నాతనిగురుం డగునాళువందారు కందాళయప్పయాచార్యులకాలముంబట్టియు నిర్ణ యింపఁదగి యుండును. అతనివర్ణనము రామకృష్ణునిచే నీక్రిందివిధముగఁ జేయంబడియెను. ఎట్లన్నను :-

సీ. వేదమార్గప్రతిష్ఠాదైవతజ్యేష్టుఁ, డభ్యస్తషడ్దర్శనార్థరాశి
   యతిరాజరచితభాష్యగ్రంథనిర్ణేత, యఖిలపురాణేతిహాసకర్త
   బంధురదివ్యప్రబంధానుసంధాత, పంచసంస్కారప్రపంచచణుఁడు
   వాధూలమునిచంద్ర వంశవర్ధనమూర్తి, సకలదేశాచార్యనికరగురువు

గీ. పట్ట మేనుంగు శ్రీరంగపతికి నణ్ణ, గారుగ ర్భాంబురాశినీహారరశ్మి
   సారసాహిత్యసర్వస్వశయ్యవేది, యాళువందారుకందాళయప్ప గారు.

వైష్ణవగురువులలో ముఖ్యు లగువారిచారిత్రములు ప్రపన్నామృతము మొదలగుగ్రంథములలోఁ గాలనిర్ణయముతోఁగూర్చి చేర్చంబడి యున్నవి. అవి యన్నియును వేఱుస్థలములలోఁ జేర్పంబడును గావున నందలివిశేషములు గాని కాలనిర్ణయము గాని వ్రాయను.

ఈవఱకును మనము వ్రాసిన రామకృష్ణునిచారిత్రము గ్రంథస్థమైనదియు సంశయింప నవసరము లేనిదియునై యున్నది. ఇఁక ముందు వ్రాయువృత్తాంత మంతయును లోకమువాడుకంబట్టి వ్రాయునదియై యున్నది. ఎట్లన్నను :-

రామకృష్ణునిజన్మాదికము.

తెనాలిరామకృష్ణుని (రామలింగము) వాసస్థలము కృష్ణామండలములోనిగార్లపా డనునొక గ్రామము. దానిచే నీతని యింటిపేరు గార్లపాటి [1] వారనియుం జెప్పఁబడును. ఈతని చిన్న నాఁడె తండ్రి గతిం

  1. ఈశ్వరప్రగ్గడవా రని మఱికొంద ఱందురు.