పుట:Kavijeevithamulu.pdf/211

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెనాలి రామకృష్ణకవి.

197

అను పైపద్యములోని చారిత్రాంశములుమాత్ర మీక్రింద వివరించెదను. ఎట్లన్నను :-

సూర్యవంశము

|

మంగరాజు

|

గురువరాజు

|

పెద్దసంగమరాజు

ఇందులోని పెద్దసంగమరాజు పూర్వసింహాసనాధీశ్వరుఁ డని యుండుటంబట్టి తూర్పుదేశములోనిసింహాసనముగలవాఁ డని తేలును. "తూర్పు"అనఁగా నేదేశమునకుఁ దూర్పని యూహింపవలసి యుండును. అప్పటికిఁ గృష్ణరాయ లుండువిజయనగర (అనిగొందె) సింహాసనమునకుఁ బశ్చిమరాజ్యసింహాసన మని ప్రసిద్ధి యుండుటంబట్టి యీపూర్వ సింహాసన మానిగొందెకుఁ దూర్పుగా నున్న యాంధ్రదేశసింహాసన మని తెలుచున్నది. సంగమేశ్వరపూజారతుఁ డని చెప్పుటచేత సంగమేశ్వరక్షేత్రములోనియీశ్వరపూజాపరాయణుఁ డని తేలును. ఈసంగమేశ్వరక్షేత్ర మెచ్చోటిది యని శంక పొడముచున్నది. అది గోదావరీమండలములోని రామచంద్రపురము తాలూకాలోనిమాండవ్యపురా వరనామమున నొప్పుమండపేటకును, నచ్చటికే క్రోసుదూరములో నున్న యేడిధె యనుగ్రామమునకు మధ్యమునం దొకగ్రామ ముండును. అది చిరకాలముక్రిందటనే చెడిపోయెను. అది ప్రస్తుతము మనము వ్రాయుచున్నప్రభునిది కాదు. రెండవసంగమేశ్వరము పూర్వ ముదయగిరిసీమలోఁ జేరినచింతకుంటతాలూకాలోని యాణిమలసముతులోని దైనట్లుగా నచ్చటికైఫియతులో నీపైరాజువంశావళి చెప్పుటచేత నూహింపనై యున్నది, (See Local Records Vol. VII page 47)) చింతకుంటతాలూకాకైఫియతు - అందులో దేవాలయమునకు దక్షిణ భాగమున నేటియొడ్డున సదాసివరాయని కాలములోని శాసన మున్నది. అదెట్లన్నను :-