పుట:Kavijeevithamulu.pdf/189

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అల్లసానిపెద్దన.

175



గతించినప్పుడే కవితాసంన్యాసము తీసికొని యుండితిని. కావుననే వర్ణ నావిషయమగు కవిత్వము చెప్పను. ఒకవేళ జెప్పుదునేని యది భగవత్పరముగా నుండవలయును. ఇట్లు నన్ను వెలయాలిపైఁ గవిత్వము చెప్ప నుత్సహింపఁ జేయుట న్యాయము గాదు, మఱియొకవర్ణనమైనం గాదు. వెలయాలిని వర్ణించుట మఱియును హైన్యము గదా. దానిజీవన మెట్టిదో వివరించెదను. చిత్తగింపుఁడు :-

చ. పడిగము తమ్మలం బుమియు పల్లవకోటికి నోరు వేణి యం
   గడిసవరంబు సంతసొరకాయ లురోజము లిచ్చ ఱచ్చసా,
   వడి యొడ లూరువుల్ గవనివాతియనంటులు మోని యెడ్డిగి
   జ్జడి వెలయాలిజీవనము జీవనమే యది యెంచి చూచినన్.

అని యిట్లు వెలయాలిదోషములు సమయోచితముగ నుడివిన రాజునకు దానిపై నుండుమోహము తగ్గింపవలయు నని తోఁచినది. పిమ్మట దాని నటు నిల్పుప్రయత్నము మాని సబహుమానముగఁ గారవించి సాఁగంబనిచెను.

కృష్ణరాయఁడు గతించినవెనుకఁ బెద్దన తనలోపము పాటించి యీక్రిందిపద్యము వ్రాసె. దీనిచే నీయిర్వురకుఁ గలమైత్త్రియుఁ గృష్ణరాయలగుణాతిశయమును గోచరమగును అదెట్లన్నను :-

సీ. ఎదురైనచోఁ దనమకరీంద్రము నిల్పి, కేలూఁత యొసఁగి యెక్కించుకొనియె
   మనుచరిత్రం బందికొని పురం బేఁగింపఁ, బల్లకి తాఁ జేతఁ బట్టి యెత్తెఁ
   గోకట గ్రామాద్య నేకాగ్రహారము, ల్చాలసీమల నిచ్చి సంతరించె
   బిరుదైనకవిగండ పెండేరమున కీవ, తగు దని నాదుపాదమునఁ దొడిగె.

గీ. నాంధ్రకవితాపితామహ యల్లసాని, పెద్దకవిచంద్ర యని నన్నుఁ బిలచు నట్టి
   కృష్ణరాయలతోడ ముగించుకొనక, వసుధఁ బ్రతికితి జీవచ్ఛవం బనంగ.

అని యిట్లు విలపించుచుఁ బెద్దన కొలఁది కాలములోపలనే మృతుండయ్యెను. అనంతరము భట్టుమూర్తి పెద్దనదారాపుత్త్రాదులం బరామర్శింప నతనియింటికిం జని వారిం గాంచి దైవయోగంబునకు దుఃఖించిన వినియోగం బేమి యున్న దని పెద్దనకడఁ దాఁ జదివినవిశ్వా