పుట:Kavijeevithamulu.pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరస్తు.

కవి జీవితములు.

రామాయణాంధ్రకవులు.

6.

హుళిక్కి భాస్కరుఁడు.

వాల్మీకిరామాయణముం దెనిఁగించిన కవిశిఖామణి యీతఁడే. ఈయనపేరిటఁ దెనుఁగురామాయణము భాస్కరరామాయణ మనంబరఁగును. ఇది భారతమునకంటెఁ గొంచెము పురాతనము. ఇది భాస్కరునిచేఁ దెనిఁగింపఁబడినట్లు విఖ్యాతి గల్గియున్నను గొంతభాగ మతని పుత్రుం డగుమల్లికార్జునభట్టారకునిచేతను, నా శేష మతనిశిష్యుం డగునయ్యలభట్టారకునిచేతను దెనిఁగింపఁబడియెను. ఇదియును భారతంబువలెఁ గారణాంతరమున శైథిల్యము నొంది పిమ్మట నీయిర్వురిచే తను సంపూర్తి చేయంబడినట్లు గోచరంబయ్యెడిని. ఈవిషయం బగు వృత్తాంతం బేమియు వాడుకలో లేదు కాని భాస్కరుఁడు మొదట గ్రంథంబు రచియించి యొకరాజునకుఁ గృతి యిచ్చుటకుఁ గొనిపోయె ననియు, నపు డారాజు దానిం గైకొనకుండుటకుఁ గనలి దాని నచ్చో నుండుగుఱ్ఱపువానికిఁ గృతి నిచ్చె ననియు, నతఁ డాతనికి విశేషంబుగ వరాల నిచ్చె ననియుం గలదు. ఆగుఱ్ఱపువాఁడే సాహిణిమారుఁడు. ఇందు గుఱ్ఱపువాఁ డనుమాటకు గుఱ్ఱమును గాచువాఁడని సాధారణముగ నర్థము చేయుదురు. ఇతఁడు గుఱ్ఱమును గాయువాఁడు గాక గుఱ్ఱపుదళవాయి యైనట్లు గాన్పించును. దానికి దృష్టాంతముగ నీవఱకే మనము భీమనచారిత్రములో కొంతచరిత్రము సూచించి యున్నారము. రాజు కృతి నంద లేదుగనుకను భాస్కరునకు స్వవాక్యపేఇపాలన