పుట:Kavijeevithamulu.pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

118

కవి జీవితములు



చించి నీటం బడవైచి కడుపులోపట వెలపటఁ బరిశుభ్రంబుగఁ గడిగి నిర్జీవంబు లగుకళేబరంబుల భుజంబులపై నిడికొని గృహంబునకుం జనుదెంచి యాకళేబరంబుల నన్న ముం దుంచి నీయాజ్ఞానుసారంబుగఁ గుఱ్ఱలకడుపులోపల వెలుపటను గడిగితిని. అనుడు నాక ళేబరంబులు చూచి పెదవీరన కన్నకడుపు గావున దుఃఖంబు నిలుపలేక ఱొమ్ము మోఁదికొనుచుఁ దమ్ముని నేమియు ననఁజాలక రోదనంబు సేయ నారంభించెను. అతనిభార్యమాత్ర మాకళేబరంబులఁ జూచి యేమియు సంశయింపక అది యంతయుఁ దనముద్దులమఱఁది లీలావినోదంబులుగ నెఱింగి నవ్వుచు నూరకుండెను. పాకంబు సిద్ధంబు చేసి యాపె పినవీరనం జూచి "అబ్బాయీ ! పిల్లలం దోడ్కొని భోజనంబునకు రమ్ము" అని పిలిచినది. తోడనే పినవీరన యన్నకు నద్భుత మావహిల్ల నాపిల్లల వారివారినామంబులచేఁ బిలిచి "మీయవ్వ బువ్వఁ దినఁ బిలుచుచున్నది. రండు రం"డని యాకళేబరంబులఁ బట్టి యెత్తెను. వారలు నిదె వచ్చితి మని యుత్తరంబు లిచ్చి లేచి వచ్చిరి. వారిం జూచి పెదవీరన యత్యంతానందంబునఁ దమ్మునిఁ గౌగిఁలించికొని అతని కట్టిమహిమల నిన్చినభగవంతుని నుతించి తనయదృష్టంబుం గొనియాడెను. అనంతరము పిల్లలంగూడి పినవీరన యన్న పొత్తున భుజించెను.

జైమినిభారతాంధ్రీకరణవిశేషములు.

ఇట్టియద్భుతకృత్యంబులు సేయుపినవీరనవిఖ్యాతి లోకంబునం దంతటను వ్యాపింపఁదొడంగెను. జనులందఱును నీతనిని దేవునిగఁజూచుచుండిరి. ఇట్లుండ నీవీరన యొకనాఁడు సాళ్వగుండనరస రాజుతో సల్లాపించుచుండెను. అపు డాతఁడు జైమినిభారతంబును దెనిఁగింప సమర్థులెవ రని పండితులతోఁ బ్రశంసించెను. వారపుడు కొందఱుపండితుల పేరులు సెప్పి వారిలో నీపినవీరన యత్యంతము సమర్థుం డని రని చెప్పి యుంటిమి. దాని విని రాజు మనకు గ్రంథము కొంచెముకాలములో సంపూర్ణము సేసి యీఁగలసమర్థు లెవ రనుడు దానికిని నితఁడే