Jump to content

పుట:Kavijanaashrayamu-Chandashastramu.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

42

కవిజనాశ్రయము.

అసంబాధవృత్తము. -
                 [1]సారప్రజ్ఞాంభోనిధి పురుష ! యసంబాధా
                 కారాన్వీతంబై చను మతనసగాయుక్తిన్. 73

భూనుతవృత్తము. -
                శ్రీనివాస! రనభావలిఁ జెంది గగంబుల్
                భూనుతంబుగ నొడంబడి భూనుత మయ్యెన్ . 74

[2]సుందరవృత్తము. --
                సుందరరూపసమేత! సుందరవృత్త మిం
                పొందుచు భారసవంబు లొంది బెడంగగున్. 75

వ. అతిశక్వరీఛందంబునకుఁ బదునై దక్షరంబులు పాదంబుగా 32768 వృత్తంబులు పుట్టె. అందు,

[3]మణిభూషణశ్రీవృత్తము. -
                శ్రావకాభరణ! శుభ్రయశా! మణిభూషణ
                శ్రీ వెలుంగు రనభార విశేషగణంబులన్. 76

అలసగతివృత్తము. -
                [4]పొలసి నసనంబు భయమున్ వెలయఁగా నిం
                దలసగతి నొందుఁ గృతియందు నుతియందున్. 77

  1. ద-సారప్రాగంభోనిధి.
  2. ద-లో నున్నది.
  3. ప-లో లేదు.
  4. ద-మొలచి.