Jump to content

పుట:Kavijanaashrayamu-Chandashastramu.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వృత్తాధికారము.

41

[1]జలదవృత్తము. -
                    ఆభరనంబుపై భగురువైనఁ గవీం
                    ద్రాభరణీయమాన ! జలదాఖ్య మగున్. 67

[2]ప్రభాతవృత్తము. -
                   మొనసి నజూరగముల్ సనం బ్రభాతం
                   బనియెడువృత్త మనంగ సన్ని భాంగా! 68

వ. శక్వరీఛందంబునకుఁ బదునాలు గక్షరంబులు పాదంబుగా 16384 వృత్తంబులు పుట్టె. అందు,

వసంతతిలకవృత్తము. -
                  సారంబుగాఁ దభజజంబు వసంతరాజా
                  కారా ! వసంతతిలకం బగు గాయుతంబై. 69

[3]పరాజితవృత్తము. -
                 ననర సలగముల్ పెనంగిన సద్యశో
                 ధన ! వినుము పరాజితం బగు రేచనా! 70

[4]వనమయూరవృత్తము. --
                 నందితా గుణా ! భజసనంబులు గగం బిం
                 పొంది చనఁగా వనమయూర మగుఁ బేర్మిన్. 71

ప్రహరణకలితవృత్తము. -
                [5]ప్రహరణకుశలా ! ప్రహరణకలితా
                సహజము లనఁగాఁ జను నసభనవల్. 72

  1. క-చ-డ-బ-లలో నున్నది.
  2. క-చ-డ-లలో నున్నది.
  3. చ-డ-లలో అపరాజితము
  4. క-చ-ద-లలో నున్నది.
  5. ద-ప్రహరణకలితం.