Jump to content

పుట:Kavijanaashrayamu-Chandashastramu.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

40

కవిజనాశ్రయము.

[1]విశ్వదేవీవృత్తము. -
                    విద్వద్వంద్యోద్యద్వృత్త ! విన్మద్వయంబున్
                    యద్వంద్వంబున్ గావించునవ్విశ్వదేవిన్. 62

వ. అతిజగతీఛందంబునకుఁ బదుమూఁడక్షరంబులు పాదంబుగా 8192 వృత్తంబులు పుట్టె. అందు,

ప్రహర్షిణీవృత్తము. –
                   నీతిజ్ఞస్తుత ! ధరణిన్ బ్రహర్షి ణీవి
                   ఖ్యాతంబుల్ మనజరగంబు లంబుజాస్యా! 63

[2]రుచిరవృత్తము. -
                  అనంగసన్నిభ! రుచిరాహ్వయం బగున్
                  ఘనంబుగా జభసజగంబు లొందినన్. 64

[3]మత్తమయూరవృత్తము. —
                 అన్వీతోద్యద్వాజ్ఞిలయా! మత్తమయూరం
                 బన్వృత్తంబయ్యెన్ మతయంబుల్ సగయుక్తిన్. 65

మంజుభాషిణీవృత్తము. -
                 జగదేకమిత్ర ! సజసంబుపై జగం
                 బగుమంజుభాషిణికి నంద మొందఁగాన్. 66

  1. ద-లో లేదు. క , డలలో దీనితరువాత నాశ్వాసాంతగద్యమును బిదప "క. మందరధరనిభనిఖిల, చ్ఛందో౽ర్ణవ పారగుండు సత్కవులకు నీ, ఛందోలక్షణ మందం, బొందఁగ నాకవిజనాశ్రయుం డొనరించెన్." అనుపద్యము నున్నవి. పద్యము ద-లోఁ గూడ నున్నది.
  2. క-డ-బ లలో మాత్ర మున్నవి.
  3. క-డ-బ లలో మాత్ర మున్నవి.