Jump to content

పుట:Kavijanaashrayamu-Chandashastramu.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వృత్తాధికారము.

43

వ. [1]అష్టీఛందంబునకుఁ బదియా ఱక్షరంబులు పాదంబుగా 65536 వృత్తంబులు పుట్టె. అందు,

పద్మవృత్తము. -
           నభజజంబులు జగంబుఁ బెనంగి యతు ల్దిశా[2]
           ప్రభవమై కవిజనాశ్రయ! పద్మ మనంజనున్. 78

ప్రియకాంతావృత్తము. -
           నయనయసంబుల్ గురువు పెనంగం బ్రియకాంతా
           హ్వయమగు శిష్టామరతరువా! దిగ్యతియైనన్.[3] 79

చంద్రశ్రీవృత్తము. -
           కవీంద్రేంద్రక్ష్మాజా! యమనసరగప్రాప్తమైనన్
           గవీంధ్రుల్ చంద్రశ్రీయనిరి యతిగా రుద్రసంఖ్యన్. 80

మేదినీవృత్తము. —
           నజభజముల్ రగంబులఁ బెనంగి దిగ్విరామ
           ప్రజనిక లొప్పు మేదినికిఁ బంకజోపమాస్యా ! 81

పంచచామరవృత్తము. --
           [4]కనద్యశా ! జరంబుతో జకారమున్ రజంబులున్
           జనన్ గకారయుక్తిఁ బంచచామరం బగున్ ధరన్. 82

[5]మదనదర్పవృత్తము. -
          శ్రీభసజరజుల్ గయుక్తిఁ జెంది వచ్చినం గుమా
          రాభ! మదనదర్ప మయ్యె నబ్జభూవిరామమై. 83

  1. ఇచ్చటనుండి యతిస్థానము వక్కాణింపఁబడినది .
  2. ద-యతిన్ దశా.
  3. ద-శిష్టాదరత దళావిశ్రమ మైనన్ .
  4. ప-చ-లలో 'జరల్ జరల్ జగంబు గూడఁజాలి రేచనా నిధి, స్ఫురద్విరామమై ధరిత్రిఁ బొల్చుఁ బంచ చామరన్.' అనియున్నది.
  5. బ-లోమాత్ర మున్నది.