Jump to content

పుట:Kavijanaashrayamu-Chandashastramu.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

34

కవిజనాశ్రయము.

వ. అనుష్టుప్ఛందంబున కెనిమిదియక్షరంబులు పాదంబుగా 256 వృత్తములు పుట్టె. అందు,

విద్యున్మాలావృత్తము. -
                             ఉద్యన్మాగాయుక్తం బైనన్
                             విద్యున్మాలావృత్తం బయ్యెన్. 25

చిత్రపదవృత్తము. - సద్విధిఁ జిత్రపదం బౌ
                            భద్వయగద్వయ ముప్పన్. 26

మాణవకవృత్తము. -
                           మాణవకాఖ్యం బగు న
                           క్షీణ భతంబు ల్లగముల్. 27

ప్రమాణీవృత్తము.-- అగున్ జకార రేఫలున్
                          లగంబునుం బ్రమాణికిన్. 28

సమానీవృత్తము. - ఇంబుగా రజంబు వకా
                          [1]రంబు గా సమాని యగున్. 29

సింహ రేఖావృత్తము. -
                         [2]శ్రీ రజంబుపై గగంబుల్
                         చేర సింహ రేఖ యయ్యెన్ . 30

వ. బృహతీఛందంబునకుఁ దొమ్మిది యక్షరంబులు పాదంబుగా 512 వృత్తంబులు పుట్టె. అందు,

భుజగశిశురుతవృత్తము. –
                        భుజగశిశురుత మౌఁ బె
                        న్నిజముగ ననయముల్ గాన్. 31

  1. ద-రంబునున్ సమాని కగున్.
  2. ద- వేరజంబుపై గగంబుల్.