వృత్తాధికారము.
33
[1]సురలతావృత్తము — పరఁగ నయంబుల్
సురలత కొప్పున్. 18
[2]వసుమతీవృత్తము. - అందంబుగఁ దసల్
పొందున్ వసుమతిన్. 19
వ. ఉష్ణిక్ఛందంబునకు నేడక్షరంబులు పాదంబుగా 128 వృత్తంబులు పుట్ట. అందు,
విభూతివృత్తము. - శ్రీఫలా విభూతికిన్
రేఫపై జగం బగున్. 20
మదనవిలసితవృత్తము. -
మదనవిలసితం
బుదిత [3]ననగముల్. 21
కుమారలలితవృత్తము[4]. -
కుమారలలిత కం
దమాయె జనగముల్. 22
సురుచిరవృత్తము –
భాసుర భసగల్ రే
చా సురుచిర మయ్యెన్. 23
[5]మదరేఖావృత్తము. -
కోపొందన్ మసగంబుల్
ప్రాపించున్ మద రేఖన్. 24