Jump to content

పుట:Kavijanaashrayamu-Chandashastramu.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వృత్తాధికారము.

35

హలముఖీవృత్తము. -
                         చిత్తజోపమ హలముఖీ
                         వృత్త మయ్యెను రనసలన్. 32

ఉత్సుకవృత్తము. –
                         సుందర మై భభరంబు లిం
                         పొందిన నుత్సుక మై చనున్. 33

భద్రకవృత్తము. -
                        విద్రుతాఘ రనరంబులన్
                        భద్రకం బగు ధరిత్రిపై.[1] 34

- యతినియమము. -



[2]క. వెలయ నిటఁబట్టి వళ్లిడ
   వలయును విశ్రమము నిలుపవలయును గబ్బం
   బులఁ గావున నే నెయ్యడ
   నిలిపితి నయ్యెడల నెఱిఁగి నిలుపుఁడు వానిన్. 35

  1. ద-లో నీపద్యముతరువాత "ఇది వాదీంద్రచూడామణి.... వియతిచ్ఛందో౽ధికారము సంపూర్ణము" అని యున్నది.
  2. బ-లో, "క. ఇట నుండి నళ్ళు విభ్రమ, ఘటనలఁ గల్పింపవలయుఁ గబ్బంబుల నె,చ్చట నే నిలిపితి బుధు లు,చ్చటఁ దగుఁబరికించి నిలుప శాస్త్ర ప్రౌఢిన్ . క. వృత్తములకుఁదగు పేళ్ళున, వృత్తగణాక్షరము లెడను విశ్రామంబుల్ వృత్తార్థము నన చప్పుదు, వృత్తసముహజ్ఞు లెల్ల వేడుకఁ బొగడన్. ఇది మొదలుగా యతులు గలవు." అని యున్నది.