Jump to content

పుట:Kavijanaashrayamu-Chandashastramu.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

24

కవిజనాశ్రయము

- ప్రాసములు. -

క. భాసురము లగుచు సుకర
   ప్రాసానుప్రాసదుష్కరప్రాసాంత్య
   ప్రాసద్విప్రాసత్రి
   ప్రాసము లన షడ్విధములఁ బరఁగును [1]గృతులన్. 76

వ. అందు సుకరప్రాసం బన్నది సులభాక్షరములు ప్రాసం బిడి చెప్పునది.[2] 77

క. పరమోపకార ధరణీ
   సురవరసురభూజ [3]సుగుణసుందర తరుణీ
   స్మరనిభ సుకరప్రాసం
   బరుదుగఁ గృతులందు నొప్పు నభినుతచరితా ! 78

వ. దుష్కరప్రాసం బన్నది విషమాక్షరంబులు ప్రాసం బిడి చెప్పునది. 79

క. స్వఃకాంతాసమ యోషిదు
   రఃకృతరతిచిహ్న దుష్కరప్రాసం బా
   విఃకృత మగు నిట్లు సుపు
   త్రః కులదీపక యనంగఁ దగుచు మహాత్మా! 80

వ. మఱి ద్విప్రాసం బన రెండక్షరంబులు ప్రొసం బిడి చెప్పునది.

క. దోసంబు లేక వస్తు ని
   వాసం బై వెలయఁ జెప్పవలయును ద్వంద్వ

  1. ప - రేచా.
  2. ఈ వచనము ద - లో లేదు.
  3. ద- వణిజ.